Published On:

Gajkesari Rajyog in May 2025: గజకేసరి రాజయోగం.. మే 28 నుంచి వీరికి అన్నీ మంచి రోజులే..!

Gajkesari Rajyog in May 2025: గజకేసరి రాజయోగం.. మే 28 నుంచి వీరికి అన్నీ మంచి రోజులే..!

Gajkesari Rajyog on 28th May 2025: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. దీని కారణంగా ఏదో ఒక గ్రహంతో సంయోగం ఏర్పడుతుంది. ఫలితంగా అనేక రకాల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. పంచాంగం ప్రకారం.. మే 28న మధ్యాహ్నం 01:36 గంటలకు చంద్రుడు బుధుడి రాశి అయిన మిథునరాశిలోకి ప్రవేశించి వృషభరాశిలో తన ప్రయాణాన్ని ముగించనున్నాడు.

 

వేద జ్యోతిష్య శాస్త్రంలో.. చంద్రుడు బృహస్పతితో కలిసి ఉన్నప్పుడు గజకేశరి యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ యోగం ఏర్పడినప్పుడు వివిధ రాశుల వారు లక్ష్మీదేవి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. దేవగురు బృహస్పతి ఒక రాశిలో దాదాపు ఒక సంవత్సరం పాటు ఉంటాడు. ఫలితంగా 12 రాశుల వారు ప్రభావితమవుతం అవుతారు. బృహస్పతి ప్రస్తుతం మిథునరాశిలో ఉన్నాడు. మే 28న చంద్రుడు మిథునరాశిలో సంచరించడంతో.. 2 గ్రహాల కలయిక మిథునరాశిలో కనిపిస్తుంది. ఈ రాశిలో రాజయోగం ఏర్పడటం వల్ల.. కొన్ని రాశుల వ్యక్తులు అద్భుత ప్రయోజనాలు పొందుతారు. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

 

మిథున రాశి:

గజకేసరి రాజయోగం మిథున రాశి వారికి చాలా మంచిది. అంతే కాకుండా ప్రయోజనకరమైనది కూడా. ఈ శుభ యోగం మీ రాశి మొదటి ఇంట్లో అంటే లగ్నరాశిలో ఉంటుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు శుభవార్తలు అందుకుంటారు. అంతే కాకుండా లాభ అవకాశాలు పెరుగుతాయి. జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతే కాకుండా మీ జీవితంలో మీ భాగస్వామి నుండి ప్రేమను పొందుతారు.

 

సింహ రాశి:

గజకేసరి రాజయోగం మీ రాశి వారికి.. అదృష్టాన్ని పెంచుతుంది. ఈ గజకేసరి రాజయోగం మీ రాశి నుండి పదకొండవ ఇంట్లో ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీరు ప్రయోజనాలను పొందుతారు. మీరు వ్యాపార రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు. అంతే కాకుండా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటారు కానీ వాటిని చాలా సులభంగా అధిగమిస్తారు. మీకు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందే అవకాశాలు లభిస్తాయి. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వింటారు. వివాహం కాని వారికి మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

 

కుంభ రాశి:

కుంభ రాశి వారికి గజకేసరి రాజయోగం చాలా ప్రయోజనకరంగా, శుభప్రదంగా ఉంటుంది. అకస్మాత్తుగా లాభ అవకాశాలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితుల్లో నిరంతర మెరుగుదల ఉంటుంది. ఆర్థిక లాభం, ఆదాయంలో పెరుగుదలకు బలమైన అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచిస్తున్న వారికి కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వింటారు. అంతే కాకుండా మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అంతే కాకుండా మీరు తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది.