Published On:

Samsung Galaxy S24 Ultra: బిగ్ ప్రైస్ డ్రాప్.. రూ.20 వేలకే సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా.. ఇది వేరే లెవల్..!

Samsung Galaxy S24 Ultra: బిగ్ ప్రైస్ డ్రాప్.. రూ.20 వేలకే సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా.. ఇది వేరే లెవల్..!

Get Samsung Galaxy S24 Ultra @ Rs 20,000 only: ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండూ Samsung Galaxy S24 Ultra 5G పై ఆఫర్ ప్రకటించాయి.మీరు కంటెంట్ క్రియేటర్ అయితే, DSLR స్థాయి ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ చేయాలనుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ మంచి ఎంపిక. ఈ స్మార్ట్‌ఫోన్‌పై క్యాష్‌బ్యాక్‌లు కూడా అందిస్తున్నారు. అలానే ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 200 మెగాపిక్సెల్ ఫోన్‌పై అందుబాటులో ఉన్న అద్భుతమైన ఆఫర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

 

Samsung Galaxy S24 Ultra Flipkart Offers

సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 256జీబీ వేరియంట్‌ను రూ.1,34,999కి ఫ్లిప్‌కార్ట్‌లో జాబితా చేశారు. కంపెనీ దాని ధరలో 33శాతం పెద్ద కోత విధించింది. ఇప్పుడు మీరు దీన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లవచ్చు. 33 శాతం తగ్గింపుతో, మీరు దీన్ని కేవలం రూ. 89,989 కి కొనుగోలు చేయవచ్చు. మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తుంది. మీరు మరింత ఆదా చేయాలనుకుంటే, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.

 

Samsung Galaxy S24 Ultra Amazon Offers

సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 256జీబీ వేరియంట్‌పై అమెజాన్ అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ ప్లాట్‌ఫామ్‌లో రూ.1,34,999 ధరకు జాబితా చేశారు. ఈ ఫోన్ పై కంపెనీ కస్టమర్లకు 34శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో, మీరు దీన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లవచ్చు,

 

అమెజాన్ ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు అనేక ఇతర ఆఫర్‌లను అందిస్తోంది. మీకు రూ. 26500 కంటే ఎక్కువ క్యాష్‌బ్యాక్ ఆఫర్, బ్యాంక్ కార్డులపై తక్షణ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తుంది. ఈ ప్రీమియం ఫోన్‌లో అమెజాన్ తన కస్టమర్లకు గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే, దానిని రూ.88,900 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఆఫర్ పూర్తి విలువను పొందినట్లయితే, మీరు దానిని కొనుగోలు చేసి కేవలం రూ. 20 వేలకు ఇంటికి తీసుకెళ్లవచ్చు.

 

Samsung Galaxy S24 Ultra Specifications

సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాలో పెద్ద 6.8-అంగుళాల డిస్‌ప్లే ఉంది, దీనిలో AMOLED ప్యానెల్ అందుబాటులో ఉంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ అందిస్తుంది. అసలు విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 పై రన్ అవుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ ఉంటుంది. 12జీబీ వరకు ర్యామ్, 1టీవీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం, దీనికి 200+10+50+12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. పవర్ కోసం 5000mAh బ్యాటరీని చూడచ్చు.