BJP Leader on Roads: బరి తెగించి.. రోడ్డు మీదే పని కానిచ్చేసిన బీజేపీ నేత!
BJP leader inappropriate behavior on Delhi Roads: రాజకీయ నేతలు ఏమైనా చేసేయొచ్చని అనుకుంటారు. ఇప్పటివరకు కొంతమంది నాయకులు హద్దులు దాటి వెళ్లడం చూశాం. కానీ, ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత ఎవరు చేయలేని పనిచేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు. జంతువుల్లా ప్రవర్తిస్తూ వీడియోలకు అడ్డంగా దొరికిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో రోడ్డు మీదే ఆ పని కనించాడు.
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి ఢిల్లీ, ముంబయి హైపై రోడ్డు మీద ఓ మహిళతో ఆ పని చేస్తూ సీసీ ఫుటేజీలకు చిక్కారు. ఇతడు బీజేపీ నేత అని తెలుస్తోంది. ఇతడు చేస్తున్న ఆ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు చిక్కింది. మామూలుగా ఇలాంటి వీడియోలు వైరల్ అవుతాయి. అది ఓ రాజకీయ నేత చేస్తున్నారంటూ మరింత వైరల్ కాగా, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వివాదాస్పద వీడియోలో ధాకడ్ ఓ తెల్ల బాలెనో కారు వద్ద మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించింది. కారు నంబర్ ఆధారంగా ఎంక్వైరీ చేశాకె, ఆ వాహనం మనోహర్ లాల్ ధాకడ్ పేరుతో నమోదైందని గుర్తించారు. వీడియో వైరల్ అయిన తర్వాత ధాకడ్ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఘటనపై మందసౌర్ జిల్లా భాన్పురా పీఎస్‌లో కేసు నమోదు చేశారు. మనోహర్ లాల్‌పై 296, 285, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదైంది. ధాకడ్‌తో పాటు ఉన్న మహిళను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మనోహర్ వీడియోపై బీజేపీ స్పందించింది. అతడికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని మందసౌర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ దీక్షిత్ స్పష్టం చేశారు. అతడికి ఎటువంటి పదవి ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఆన్లైన్ ద్వారా సభ్యత్వం తీసుకొని ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. కానీ, మనోహర్ లాల్ ధాకడ్ భార్య బీజేపీ మద్దతుతో జిల్లా పంచాయతీ 8వ వార్డు సభ్యురాలు అని సమాచారం. పోలీసులు ధాకడ్ కోసం గాలింపు చర్యను ముమ్మరం చేశారు.