Home / Uttarakhand
Red Alert To Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు తోడయ్యాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రధాన నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇక మండి జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. కాంగ్రా, మండి, హమీర్ పూర్, సిమ్లా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో రేపటి వరకు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ […]
Chardham Yatra Stopped for 24 hours: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో చార్ ధామ్ యాత్రకు ఆటంకం ఎదురవుతోంది. యాత్రను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్, వికాస్ నగర్ వద్ద యాత్రికులను ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు నేడు, రేపు ఉత్తరాఖండ్ లో మరిన్ని భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ […]
Cloud Burst In Uttarkashi: ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో కుంభవృష్టి వర్షాలు పడ్డాయి. బార్ కోట్- యమునోత్రి మార్గంలోని సిలాయ్ బాంద్ లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ ధ్వంసమైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని ఉత్తరకాశీ […]
10 Missing, 1 Killed after Bus Falls Into Alakananda River in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ఘోల్తీర్ సమీపంలో ఉన్న అలకనంద నదిలో ఓ బస్సు కిందపడిపోయింది. వివరాల ప్రకారం.. రుద్రప్రయాగ్ జిల్లాలో పర్యాటకులతో వెళ్తున్న బస్సు అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకరు మరణించగా.. 10 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా […]
President Draupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేదికపై భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. ముర్ము 67వ పుట్టినరోజు సందర్భంగా డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అంధ విద్యార్థులు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు గీతాలు ఆలపించారు. ఈ క్రమంలో ముర్ము భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్‌లో మూడురోజుల పర్యటనకు వెళ్లిన ఆమె డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్ డిసేబిలిటీని […]
Uttarakhand helicopter crash: ఉత్తరాఖండ్ గౌరీకుండ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మరణించారనే వార్త చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా సమీక్షించి, యాత్రికుల భద్రతకు, వారి ప్రాణాలకు భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి చేశారు. […]
7 Died in Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలి పైలట్ సహా ఏడుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో ఐదుగురు స్పాట్ లోనే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గౌరికుండ్- త్రిజుగి నారాయణ్ మధ్య అటవీ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్ కూలిపోయింది. కాగా ఆర్యన్ ఏవియేషన్ కు సంస్థకు చెందిన హెలికాప్టర్ కేదార్ నాథ్ నుంచి గుప్తకాశీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో […]
Uttarakhand Landslides: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బద్రీనాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడి 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెస్క్యూ టీమ్ జేసీబీల సాయంతో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఉన్న ధరి దేవి ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఖంక్ర రహదారిపై కొండ చరియలు విరిగిపడి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ఎప్పటికప్పుడు […]
Helicopter crash in Kedarnath Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం తప్పింది. కేదార్నాథ్ దగ్గర ఓ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ముందు క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాద సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులు భయాందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం.. కేదార్నాథ్ దర్శించుకునేందుకు భక్తులు హెలికాప్టర్లో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ముందే క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ తోక భాగం పూర్తిగా విరిగిపోవడంతో […]
4 ki Crashes in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కాశీ జిల్లా గంగ్నాని వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వీరంతా హెలికాప్టర్లో గంగోత్రి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. […]