Realme Narzo 80x 5G: సేల్‌కి వచ్చేసిన రియల్‌మి కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయ్.. ఆఫర్లు చూస్తే నెక్స్ట్ లెవల్..!

Realme Narzo 80x 5G: రియల్‌మి ఇటీవల తన నార్జో 80 సిరీస్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మి నార్జో 80x 5G, రియల్‌మి నార్జో 80 ప్రో 5G ఫోన్‌లు ఉన్నాయి. ఈ మొబైల్స్ భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించాయి. వీటిలో ‘Realme Narzo 80x 5G’ మొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మీరు రూ.2000 తగ్గింపుతో అద్భుతమైన బ్యాంక్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు
రియల్‌మి నార్జో 80x 5G మొబైల్ బడ్జెట్ ధరకు మార్కెట్లోకి విడుదలైంది. ఇది రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది 6.72-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ధర, ఆఫర్లు, ఇతర ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Realme Narzo 80x 5G Price
రియల్‌మి నార్జో 80x 5G ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.13,999కి అమ్ముడవుతోంది. అదేవిధంగా, 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.14,999. కంపెనీ రూ. 500 బ్యాంక్ ఆఫర్, రూ. 1,500 కూపన్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. మీరు దీన్ని కేవలం రూ.11,999కే కొనుగోలు చేయవచ్చు. 128GB స్టోరేజ్ వేరియంట్ ఆఫర్లతో కేవలం రూ.12,999కే లభిస్తుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయచ్చు.
Realme Narzo 80x 5G Features
రియల్‌మి నార్జో 80x 5G మొబైల్ 6.72-అంగుళాల LCD డిస్‌ప్లేతో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా realme UI 6.0 తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 6జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్ ఉన్నాయి. 128జీవీ స్టోరేజ్, 128జీబీ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉన్నాయి.
రియల్‌మి నార్జో 80x 5G ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అదనంగా, రెండవ కెమెరాలో 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ 5G ఫోన్‌లో 6000mAh సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్‌ను చూడచ్చు. దీనితో పాటు, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 200శాతం సూపర్ వాల్యూమ్ మోడ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- Nothing Phone 3: నథింగ్ ఫోన్ క్రేజే వేరబ్బా.. AI ఫీచర్లు, కెమెరా అదిరిపోయింది.. మీ బడ్జెట్ ధరలో కిర్రాక్..!