Moto G86 Power 5G: ఇక రచ్చ రచ్చే.. మోటో కొత్త G86 పవర్.. స్టన్నింగ్ డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్స్

Moto G86 Power 5G Launch with 6720mah Battery: లెనోవా అనుబంధ సంస్థ మోటరోలా త్వరలో తన ఫ్లాగ్‌షిప్ G-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని పేరు Moto G86 Power 5G. అయితే, బ్రాండ్ అధికారికంగా లాంచ్ తేదీ లేదా ఫోన్ ఇతర వివరాలను ధృవీకరించలేదు. కానీ ఇంటర్నెట్‌లో Moto G86 పవర్ 5G కలర్ ఆప్షన్‌లు ,ఇతర ముఖ్యమైన ఫీచర్లు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం, మోటో ఈ ఫోన్‌ను 4 అద్భుతమైన రంగు ఎంపికలలో అందిస్తుంది – క్రిసాన్తిమం (లేత ఎరుపు), కాస్మిక్ స్కై (ఊదా), గోల్డెన్ సైప్రస్ (ఆలివ్ ఆకుపచ్చ), స్పెల్‌బౌండ్ (నీలం-బూడిద).
ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి వేరియంట్ వెనుక ప్యానెల్‌పై వేరే ఆకృతిని కలిగి ఉంటుంది. ఫోన్ స్పెల్‌బౌండ్ వేరియంట్‌లో ఎకో లెదర్‌ను ఉపయోగించగా, మిగిలిన మూడు వేరియంట్‌లలో టెక్స్చర్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. అదే సమయంలో, కాస్మిక్ స్కై వేరియంట్ ఆకృతి ఫాబ్రిక్ ఫినిషింగ్ లాగా ఉంటుంది.
Moto G86 Power 5G Features
మోటరోలా కొత్త G86 పవర్ ఫోన్ Moto G86 మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంది, కానీ దాని పెద్ద బ్యాటరీ కారణంగా, ఇది కొంచెం మందంగా , బరువుగా ఉంటుంది. ఇందులో 6.67-అంగుళాల ఫ్లాట్ pOLED డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2712 x 1220 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్‌ప్లేని ప్రొటక్ట్ చేయడానికి గొరిల్లా గ్లాస్ 7i అందించారు.
ఫోన్ ఫ్రేమ్, వెనుక ప్యానెల్ రెండూ ఫ్లాట్‌గా ఉంటాయి. కెమెరా ఐలాండ్ ఎగువ-ఎడమ మూలలో ఎటువంటి బ్లోటింగ్ లేకుండా ఉంచారు. పవర్,వాల్యూమ్ బటన్లు ఫోన్ పైభాగంలో కుడి వైపున ఉన్నాయి. డాల్బీ అట్మోస్ బ్రాండింగ్ ఇచ్చారు. ముందు భాగంలో చిన్న పంచ్-హోల్ కెమెరా,సన్నని బెజెల్స్ ఉన్నాయి.
మోటో G86 పవర్ 5G, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు ర్యామ్ ఎంపికలలో లభిస్తుంది – 8GB , 12GB. స్టోరేజ్ కోసం 128GB , 256GB ఎంపికలు ఉంటాయి, వీటిని మైక్రో SD కార్డ్‌తో విస్తరించవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. రెండు సంవత్సరాల OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల ద్వైమాసిక భద్రతా ప్యాచ్‌లను పొందుతుంది.
కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఫోన్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా ఉంది, ఇందులో సోనీ LYTIA 600 సెన్సార్, f/1.88 ఎపర్చరు, OIS సపోర్ట్ ఉన్నాయి. దీనితో 8MP మాక్రో కెమెరా అందుబాటులో ఉంటుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఫోన్ అతిపెద్ద లక్షణం దాని 6,720mAh బ్యాటరీ, దీని కారణంగా ఫోన్ బరువు 198 గ్రాములకు చేరుకుంటుంది. ఇది 8.65మి.మీ మందం. 33W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అయితే, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఇందులో అందించలేదు. Moto G86 పవర్ 5G IP68, IP69 రేటింగ్‌లను పొందింది. MIL-STD-810H సర్టిఫికేషన్‌తో డ్రాప్ రెసిస్టెంట్‌ను కూడా ఉంది.
ఇతర ఫీచర్స్‌లో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, బ్లూటూత్ 5.4, ప్రాంతాన్ని బట్టి సింగిల్ లేదా డ్యూయల్ సిమ్ ఎంపికలు ఉన్నాయి. ఈ ఫోన్ లాంచ్ తేదీని మోటరోలా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, Moto G86 5G స్పెసిఫికేషన్లు, రెండర్‌లు కూడా లీక్ అయ్యాయి, రెండు మోడల్‌లు ఒకేసారి లాంచ్ కావచ్చని సూచిస్తుంది.