Published On:

Earthquake in Pakistan: పాక్‌లో మరోసారి భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత

Earthquake in Pakistan: పాక్‌లో మరోసారి భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత

Earthquake in Pakistan during India Pakistan War: పాక్‌లో ఇవాళ మధ్యాహ్నం మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సస్మోలజీ వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. భూకంప కేంద్రం తజికిస్థాన్‌లోని అష్కాషెమ్‌కు పశ్చిమాన ఆప్ఘనిస్థాన్ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఎన్‌సీఎస్ తెలిపింది.

 

ఈ నెల 10న భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అదే క్రమంలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆందోళనకు గురైన పాక్ పౌరులు భయంతో పరుగులు తీశారు. తాజాగా, మరో భూకంపం రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. నేషనల్ సెంటర్ ఫర్ సస్మోలజీ ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది. 29.67 డిగ్రీల ఉత్తర అక్షాంశం 66.10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద నమోదైంది.

ఇవి కూడా చదవండి: