Nothing Phone 3: నథింగ్ ఫోన్ క్రేజే వేరబ్బా.. AI ఫీచర్లు, కెమెరా అదిరిపోయింది.. మీ బడ్జెట్ ధరలో కిర్రాక్..!

Nothing Phone 3: UKకి చెందిన టెక్నాలజీ సంస్థ నథింగ్ వ్యవస్థాపకుడు, సిఈఓ అయిన కార్ల్ పీ, రాబోయే నెలల్లో నథింగ్ ఫోన్ 3 లాంచ్ అవుతుందని ధృవీకరించారు. 2023 నథింగ్ ఫోన్ 2 ఈ సక్సెసర్‌గా గత సంవత్సరం లాంచ్ అవుతుందని భావించారు, కానీ కంపెనీ ఈ సమయంలో మిడ్ రేంజ్ ఫోన్ 2a, ఫోన్ 2a ప్లస్ మోడళ్లను విడుదల చేసింది. దాని మునుపటి మోడళ్ల మాదిరిగానే, కంపెనీ తదుపరి హై-ఎండ్ ఫోన్ ట్రాన్స్‌పాంట్ వెనుక ప్యానెల్, గ్లిఫ్ లైటింగ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే ఫోన్‌లో కొన్ని AI-ఆధారిత ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
Nothing Phone 3 Launch Date
శుక్రవారం నాడు X (గతంలో ట్విట్టర్)లో 10 నిమిషాల ఆస్క్ మీ ఎనీథింగ్ (AMA) సెషన్‌లో వినియోగదారు ప్రశ్నకు సమాధానంగా నథింగ్ ఫోన్ 3 లాంచ్ టైమ్‌లైన్‌ను కార్ల్ పీ ప్రకటించారు. 2025 మూడవ త్రైమాసికంలో (Q3) ఫోన్ 3 విడుదల కావచ్చు. అంటే జూలై- సెప్టెంబర్ మధ్య రావచ్చు.
ఈ లాంచ్ విండో కంపెనీ మునుపటి స్మార్ట్‌ఫోన్‌ల విడుదలతో సమానంగా ఉంటుంది. నథింగ్ ఫోన్ 2 జూలై 11, 2023న లాంచ్ అయింది, మొదటి తరం నథింగ్ ఫోన్ 1 జూలై 21, 2022న సేల్‌కి వచ్చింది. UK సంస్థ గత సంవత్సరం నథింగ్ ఫోన్ 3ని లాంచ్ చేస్తుందని పుకార్లు వచ్చాయి, అయితే కంపెనీ పర్సనైల్జ్ AIపై దృష్టి సారించిందని, అందుకే ఆలస్యం జరిగిందని పీ చెప్పారు.
Nothing Phone 3 Specifications
స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో, నథింగ్ ఫోన్ 3 గురించి ప్రస్తుతం పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. దీని మునుపటి మోడల్, నథింగ్ ఫోన్ 2, స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌తో 12జీబీ వరకు ర్యామ్, 512జీవీ వరకు స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.7-అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
నథింగ్ ఫోన్ 2లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. దీనికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4,700mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 47W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
నథింగ్ ఫోన్ 3 గురించిన సమాచారం లీక్‌ల ద్వారా తెరపైకి వచ్చింది. ఈ ఫోన్ AI-ఆధారిత ఫీచర్స్‌పై దృష్టి పెడుతుంది, ఇందులో నథింగ్ OSలో లోతైన AI ఇంటిగ్రేషన్ ఉండవచ్చు. ఐఫోన్-ప్రేరేపిత యాక్షన్ బటన్, 6.5-అంగుళాల డిస్ప్లేను పొందడం గురించి కూడా చర్చ జరుగుతోంది. అదనంగా, ప్రో వేరియంట్, నథింగ్ ఫోన్ 3 ప్రో, 6.7-అంగుళాల స్క్రీన్‌తో లాంచ్ కావచ్చు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ వంటి మిడ్-రేంజ్ ప్రాసెసర్‌లు ఉంటాయని భావిస్తున్నారు, ఇది ధరను మరింత సరసమైనదిగా చేస్తుంది.
Nothing Phone 3 Price
భారతదేశంలో నథింగ్ ఫోన్ 1 ప్రారంభ ధర రూ.32,999 కాగా, ఫోన్ 2 రూ.44,999కి లాంచ్ అయింది. నథింగ్ ఫోన్ 3 ధర గురించి అధికారిక వివరాలు లేవు. కానీ లీక్‌ల ప్రకారం, ఇది మిడ్ రేంజ్ విభాగంలో ఉండవచ్చు. బహుశా దీని ధర రూ. 50,000 కంటే తక్కువగా ఉండవచ్చు. అదే సమయంలో, ప్రో వేరియంట్ ధర రూ. 55,000 కంటే ఎక్కువగా ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి:
- iPhone 15 Price Drop: ఐఫోన్ 15 ధర మళ్లీ కుప్పకూలింది.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు.. అసలు తగ్గద్దు బ్రో..!