Discount on iPhone 15 Mobile: ఐఫోన్ 15పై ఇంత తగ్గింపా..? ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!

8% Discount offer on iPhone 15: ప్రముఖ ఫోన్ కంపెనీ యాపిల్ ప్రతి సంవత్సరం ఒక కొత్త, తాజా మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ సంవత్సరం 2025 లో, యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరం లాగే, యాపిల్ కొత్త మోడల్ సెప్టెంబర్ నెలలో లాంచ్ కావచ్చు. అయితే, కంపెనీ ఇంకా అధికారిక సమాచారాన్ని పంచుకోలేదు. అయితే, పాత యాపిల్ మోడళ్లను తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుంది.
మీరు ఇప్పటికీ iPhone 12, iPhone 13 లేదా iPhone 14 వాడుతూ, iPhone 16 కొనాలనే ఉద్దేశ్యం లేకపోయినా, అప్‌డేట్ చేయాలని ఆలోచిస్తుంటే, మీరు iPhone 15 ని ఎంచుకోవచ్చు. అసలు ధర కంటే చాలా తక్కువ ధరకు iPhone 15 ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు ఐఫోన్ 15 ను ఎలా ? ఎక్కడ నుండి చౌకగా కొనుగోలు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 15 Price Cut
ఐఫోన్ 15 మొబైల్ 128 GB వేరియంట్‌ను డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. దీని ధరపై ప్రత్యక్షంగా 8 శాతం తగ్గింపు ఇస్తున్నారు. మీరు ఐఫోన్ 15 ను రూ.69,900కు బదులుగా రూ.63,999 కి కొనుగోలు చేయవచ్చు. దీని 128 GB వేరియంట్ డిస్కౌంట్ తర్వాత రూ. 63,999 కు లభిస్తుంది, కానీ మీరు మరింత డిస్కౌంట్ పొందాలనుకుంటే మీరు ఇతర ఆఫర్లను కూడా చెక్ చేయచ్చు.
iPhone 15 Bank Offers
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపుపై మీకు 5శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే, EMI కాని లావాదేవీలపై రూ. 2000 వరకు తగ్గింపు పొందచ్చు. మీరు ఏదైనా ఇతర బ్యాంక్ కార్డు ఉపయోగించి లావాదేవీలు చేస్తే, మీరు రూ. 3000 వరకు డిస్కౌంట్ పొందుతారు. మీరు నెలకు రూ. 10,667 ప్రారంభ EMIతో iPhone 15 ను కూడా కొనుగోలు చేయచ్చు.
iPhone 15 Exchange Offers
ఐఫోన్ 15 ధరపై మరింత తగ్గింపు పొందడానికి ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉత్తమ ఎంపిక. మీరు మీ పాత ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా రూ.41,150 వరకు తగ్గింపు పొందచ్చు, కానీ ఎక్స్ఛేంజ్ బోనస్ పూర్తి విలువ పొందడానికి, మీరు నిబంధనలు, షరతుల ప్రకారం మీ ఫోన్‌ను మార్చుకోవాలి. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పూర్తి ప్రయోజనాన్ని తాజా మోడల్ , మంచి స్థితిలో ఉన్న ఐఫోన్‌పై మాత్రమే పొందవచ్చు. అటువంటి పరిస్థితిలో ఐఫోన్ 15 ధర మీకు చాలా తక్కువగా ఉండవచ్చు.