Last Updated:

Sourav Ganguly : క్యాబ్‌ పీఠమెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్న సౌరవ్‌ గంగూలీ

'నేను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఆక్టోబర్‌ 22న నా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నానని, ఐదేళ్ల పాటు నేను క్యాబ్ అధ్యక్షుడిగా పని చేశా.

Sourav Ganguly : క్యాబ్‌ పీఠమెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్న సౌరవ్‌ గంగూలీ

Sourav Ganguly:  టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న గంగూలీ.. తిరిగి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్‌) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.క్యాబ్‌ పీఠమెక్కేందుకు దాదా ఆసక్తి చూపిస్తున్నారని అధికారిక సంబంధిత వర్గాల నుంచి సమాచారం. 2015 నుంచి 2019 వరకు సౌరవ్‌ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడిగా పనిచేశారు.

‘నేను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను. ఆక్టోబర్‌ 22న నా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నానని, ఐదేళ్ల పాటు నేను క్యాబ్ అధ్యక్షుడిగా పని చేశా.లోధా నిబంధనల ప్రకారం మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగవచ్చు.అక్టోబర్ 20న ప్యానెల్‌ను ఖరారు చేస్తారు..అప్పటివరకు ఏం జరుగుతుందో వేచి చూద్దాం అని ఓ జాతీయ మీడియాతో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చెప్పారు.అంతక ముందు సౌరవ్‌ గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ కూడా క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించారు.

ఇంకో వైపు BCCI అధ్యక్షుడిగా టీమిండియా మాజీ క్రికెటర్‌ రోజర్‌ బిన్నీ ఎన్నికవడం దాదాపుగా ఖాయమైనట్లు తెలిసిన సమాచారం.ముంబైలో జరిగిన బీసీసీఐ స‌మావేశాల అనంతరం ఈ విషయం బయటికి వెల్లడించారు.BCCI అధ్య‌క్ష ఎన్నిక‌లు ఈ నెల 18న జ‌ర‌గ‌నున్నాయి. BCCI ఉపాధ్యక్ష పదవి బరిలో రాజీవ్‌ శుక్లా రేసులో ఉండగా.. బీసీసీఐ కార్యదర్శి జై షా అదే స్థానంలో కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి: