Published On:

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్

IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. గాయం కారణంగా చైన్నై కెప్టెన్ రుతురాజ్ టోర్నీకి దూరం అయ్యాడు. దీంతో జట్టుకు ఎంఎస్ ధోని సారధిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతా 6వ స్థానంలో ఉంది. వ‌రుస‌గా నాలుగు ప‌రాజ‌యాల‌తో 9వ స్థానంలో కొన‌సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ విజ‌యంతో ఆత్మ‌విశ్వాసం కూడ‌గ‌ట్టుకోవాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంది. దాంతో అచ్చొచ్చిన చెపాక్‌లో ధోనీ చైన్నైని గెలిపిస్తాడా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త రికార్డులు ప‌రిశీలిస్తే కేకేఆర్‌పై చెన్నై ఆధిప‌త్యం చెలాయిస్తూ వ‌స్తోంది. ఇరుజ‌ట్లు 29 సార్లు తలపడగా, చైన్నై 19 విజ‌యం సాధించ‌గా, కేకేఆర్ 10 సార్లు మాత్ర‌మే గెలిచింది.

ఇవి కూడా చదవండి: