Published On:

Alekhya Chitti Pickles: బిగ్ బాస్ లోకి అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్.. ?

Alekhya Chitti Pickles: బిగ్ బాస్ లోకి అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్.. ?

Alekhya Chitti Pickles: గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు ఏదైనా ఉంది అంటే అది అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య, రమ్య, చిట్టి..  అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే పికిల్స్ బిజినెస్ నడుపుతున్నారు. రమ్య ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక పికిల్స్ బిజినెస్, ప్రమోషన్స్, రీల్స్.. ఇలా సాగుతున్న వీరి జీవితం ఒక్క ఆడియోతో కూలిపోయింది. పికిల్స్ రేటు ఎక్కువగా ఉంది అన్న పాపానికి ఒక కస్టమర్ ను ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరు బూతులు తిట్టారు.

 

“ఈ మాత్రం రేట్లు కూడా ఎక్కువ అంటున్నావ్ అంటే పెళ్ళాన్ని ఏమి పెట్టి పోషిస్తావ్..  నా మాట విని పెళ్లి చేసుకోకు. పికిల్స్ కూడా కొనలేని మొగుడితో అది ఉండలేదు” అంటూ బూతులు తిట్టింది. ఇక ఈ ఆడియో మెసేజ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అది ఎంతలా అంటే సినిమా ప్రమోషన్స్ తో పాటు జియో హాట్ స్టార్ కూడా పికిల్స్ గురించి మాట్లాడేంత.

 

అవును.. తాజాగా  జియో హాట్ స్టార్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో పికిల్స్ గురించి మాట్లాడుతూ .. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ పికిల్స్ పడుతున్న వీడియోను జతచేసింది. దీనికి క్యాప్షన్ గా ” బయట పికిల్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఇంట్లోనే పట్టుకుందాం” అని రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్స్ ట్రెండ్ బాగా ఫాలో అవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇక జియో హాట్ స్టార్ ఇలా పెట్టడంతో మరికొంతమంది నెక్స్ట్ బిగ్ బాస్ కు ఈ ముగ్గురు సిస్టర్స్ లో ఒకరిని తీసుకురావడానికి ప్లాన్ చేసి ఉంటారని చెప్పుకొస్తున్నారు. ఈ మధ్యనే యూట్యూబర్ ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్ సీజన్ 9 లో కచ్చితంగా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో ఒకరిని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియో కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రమే అని, బిగ్ బాస్ కు వీరికి సంబంధం లేదని మరికొందరు అంటున్నారు.

 

నిజం చెప్పాలంటే.. ఇలాంటి వారు బిగ్ బాస్ లోకి అడుగుపెడితే.. కచ్చితంగా మారినంత ట్రోలింగ్ కు గురవుతారని, అక్కినేని నాగార్జున ఇలాంటివారిని ఎంకరేజ్ చేయడని చెప్పుకొస్తున్నారు. కానీ, బిగ్ బాస్ కు కావాల్సింది ఇలాంటివారే అని, అప్పుడే హౌస్ లో కాంట్రవర్సీ నెలకొని మరింత రేటింగ్ వస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.