Google Pixel 8 Massive Price Cut: ఫ్లిప్‌కార్ట్ అంటే మజాకా.. రూ.83 వేల ఫోన్ రూ.21 వేలకే .. ఛాన్స్ మిస్ కావద్దు!

Google Pixel 8 Massive Price Cut: కెమెరా సెంట్రిక్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గురించి మాట్లాడినప్పుడల్లా గూగుల్ పిక్సెల్ పేరు ఖచ్చితంగా తెరపైకి వస్తుంది. సాధారణ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే గూగుల్ పిక్సల్ ఫోన్లు చాలా కాస్ట్‌లీ, అందుకే చాలా మంది వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. మీరు కూడా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ కానాలనుకుంటే లక్షల బడ్జెట్ లేకపోతే మీకో శుభవార్త ఉంది. గూగుల్ పిక్సెల్ 8 ధర భారీగా తగ్గింది. ఇప్పుడు మీరు దానిని సులభంగా కొనుగోలు చేయచ్చు.
గూగుల్ గత సంవత్సరం గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌ను విడుదల చేసింది. కొత్త సిరీస్ ప్రారంభించిన వెంటనే, పాత మోడళ్ల ధరలు తగ్గడం ప్రారంభించాయి. గూగుల్ పిక్సెల్ 8 ను చౌకగా కొనుగోలు చేయడానికి ఇప్పుడు ఒక గొప్ప అవకాశం. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ ధరను దాని వాస్తవ ధర కంటే చాలా తక్కువగా తగ్గించింది. మీరు ఫోటోగ్రఫీ,వీడియోగ్రఫీని ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానిపై అందుబాటులో ఉన్న ఆఫర్లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Google Pixel 8 Offers
గూగుల్ పిక్సెల్ 8 మొబైల్ 256GB వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.82,999కి జాబితా చేశారు. అయితే, మీరు దానిని దాదాపు సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ తన ధరను 42శాతం భారీగా తగ్గించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తర్వాత, దీని ధర కేవలం రూ.47,999 మాత్రమే. మీరు దీన్ని కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.
మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను దాదాపు రూ.21 వేలకు కొనుగోలు చేయచ్చు. అయితే, దీని కోసం మీరు ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలి. గూగుల్ పిక్సెల్ 8 కొనుగోలుపై కస్టమర్లకు కంపెనీ రూ.26,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా పూర్తి ఎక్స్ఛేంజ్ విలువను పొందినట్లయితే, మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.21,799కి కొనుగోలు చేయవచ్చు.
Google Pixel 8 Specifications
గూగుల్ పిక్సెల్ 8 లో గూగుల్ అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్‌ను ఇచ్చింది. ఈ ప్రీమియం ఫోన్‌లో IP68 రేటింగ్ ఉంది, ఇది నీరు, ధూళి నుండి సురక్షితంగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల OLED ప్యానెల్ డిస్‌ప్లే ఉంది. అసలు విషయం ఏమిటంటే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 పై రన్ అవుతుంది, దీనిని మీరు అప్‌గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. గూగుల్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్‌ను అందించింది. గూగుల్ పిక్సెల్ 8 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో 50 + 48 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 10.5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు శక్తినివ్వడానికి 4700mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 27W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ఇవి కూడా చదవండి:
- OnePlus 13T Launch: కొత్త ఫోన్ భలేగా ఉందే.. వన్‌ప్లస్ 13T ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు