IPL 2025 : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్

IPL 2025 – Axar Patel : ఐపీఎల్ 18వ సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నప్పటికీ, అతడు కెప్టెన్‌ను తీసుకొనేందుకు మొగ్గు చూపలేదు. దీంతో అక్షర్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తూ ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రిషభ్ పంత్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈసారి అతడిపి వదులుకున్న సంగతి తెలిసిందే. రిషభ్‌ను ఈసారి
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు తీసుకుని కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.
కీలక ఆల్‌రౌండర్‌గా..
ప్రస్తుత ఇండియా క్రికెట్‌లో రవీంద్ర జడేజా స్పిన్ ఆల్‌రౌండర్. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికాడు. అతడి స్థానంలో భారత్‌కు కీలకంగా మారే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్. కేవలం బౌలింగ్‌లో కాకుండా బ్యాటింగ్‌లో పరుగులు చేయగల సత్తా ఉన్న క్రికెటర్. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అక్షర్ ఆటను చూశాం. ఐదో స్థానంలో వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటి వరకు ఇండియా తరఫున 14 టెస్టులు, 68 వన్డేలు, 71 టీ20లు ఆడాడు. 150 ఐపీఎల్ మ్యాచుల్లో పాల్గొన్నాడు. ఐపీఎల్‌లో 1,653 పరుగులు, 123 వికెట్లు పడగొట్టాడు.
రాహుల్ అభినందనలు..
కెప్టెన్‌గా ఎంపికైన అక్షర్ పటేల్‌కు కేఎల్ రాహుల్‌కు అభినందనలు తెలిపాడు. కంగ్రాట్స్ బాపు (అక్షర్ పటేల్). ఈ నూతన ప్రయాణంలో అక్షర్‌కు అంతా మంచి జరగాలని కోరుకున్నాడు. తన వంతు సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుందని రాహుల్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. కేఎల్ రాహుల్ గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టకు కెప్టెన్‌గా ఉన్నాడు.