Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. డబుల్ సెంచరీ కొట్టిన షమీ

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్‌కు టీమిండియాకు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన షమీ వన్డేల్లో 200 వికెట్ల తీసి రికార్డు ఎక్కాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. 5126 బంతుల్లో షమీ ఈ రికార్డును సాధించాడు. అంతుకు ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది.
స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. భారత బౌలర్లు దాటికి ఆదిలో రెండు వికెట్లు కొల్పోయింది. ఇక 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 46.5 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 215/8 ఉంది. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశారు.