IPL 2025 Final Match: 18 ఏళ్ల కల.. ఐపీఎల్ మెగా ఫైనల్‌లో కొత్త ఛాంపియన్ ఎవరు..?
Royal Challengers Bengaluru vs Punjab Kings Today Final Match IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ చివరిదశకు చేరుకుంది. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మెగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. గత 18 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం ఇరు జట్లు ఎదురుచూస్తున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి ట్రోఫీని ముద్దాడాలని ఆర్సీబీతో పాటు పంజాబ్ ఆశిస్తుంది.
ఇరు జట్ల బలబలాల విషయానికొస్తే.. ఆర్సీబీ నాలుగో ఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా.. పంజాబ్ జట్టుకు రెండో ఫైనల్ కావడం విశేషం. ఆర్సీబీ అనుభవం కొంతమేర ప్లస్ కావడంతో పాటు ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచి నిలకడగా ఆడుతూ వస్తుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగంలో మంచి ఫామ్ కొనసాగిస్తుంది. ఇక, పంజాబ్ జట్టు దూకుడుగా వ్యవహరించి ఫైనల్ చేరుకుంది. 2014 తర్వాత ఫైనల్ చేరింది. అయితే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. గతేడాది కేకేఆర్‌కు కప్పు అంటబెట్టాడు. ఈసారి పంజాబ్‌ను ఫైనల్ చేర్చాడు.
ఇరు జట్లలలో కీలక ఆటగాళ్లు ఉన్నారు. బెంగళూరులో జోష్ హేజిల్ వుడ్ అత్యంత కీలక ఆటగాడు కాగా, భువనేశ్వర్ అనుభవం ప్లస్ కావొచ్చు. అంతేకాకుండా యశ్ దయాళ్, కృనాల్ పాండ్య, సుయాశ్ వర్మ మెరిస్తే పంజాబ్‌ను కట్టడి చేయడం సులువే. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీతో పాటు సాల్ట్ మంచి ఫామ్ కొనసాగిస్తున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు భారీ పరుగులు చేస్తే కలిసొచ్చే అవకాశం ఉంది. పాటీదార్, లివింగ్ స్టన్, షెఫర్డ్ ఆడితే భారీ స్కోరు చేసే ఛాన్స్ ఉంది.
ఇక, పంజాబ్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ప్రభు సిమ్రన్, ప్రియాంశ ఆర్య ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్, స్టాయినిస్ దూకుడుగా ఆడితే భారీ స్కోరు వచ్చే అవకాశం ఉంది. బౌలర్లలో అర్ష్ దీప్, చాహల్ అనుభవ బౌలర్లు ఉన్నా.. అజ్మతుల్లా, జేమీసన్‌ల ఫామ్ పర్వాలేదు. వీరంతా నిలకడగా బౌలింగ్ చేస్తేనే ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది.