Published On:

IPL 2025: ఐపీఎల్ విజేతకు ప్రైజ్ మనీ ఎంత?.. అవార్డు ఎవరికి వచ్చాయ్?

IPL 2025: ఐపీఎల్ విజేతకు ప్రైజ్ మనీ ఎంత?.. అవార్డు ఎవరికి వచ్చాయ్?

Prize Money: రెండు నెలలుగా 10 జట్ల మధ్య హోరెత్తించిన ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. ట్రోఫీ కోసం 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఆర్సీబీ కల నెరవేరింది. ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మ్యాచ్ తర్వాత ప్రజంటేషన్ వేడుకల్లో విజేత ఆర్సీబీ, రన్నరప్ పంజాబ్ కింగ్స్ తో పాటు పలువురు ఆటగాళ్లకు అవార్డులు లభించాయి. ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ పంజాబ్ కింగ్స్ కు రూ. 12.5 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.

పంజాబ్ కోచ్, సపోర్ట్ స్టాఫ్ రన్నరప్ షీల్డ్, ఐపీఎల్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ లు అందుకున్నారు. ఐపీఎల్ విజేతలతో పాటు పలు అవార్డులు సైతం ఇచ్చే విషయం తెలిసిందే. ఈ సారి ఆరెంజ్ క్యాప్ అత్యధిక పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ కు దక్కింది. సాయి సుదర్శన్ ఈ సీజన్ లో 759 పరుగులు చేశాడు. మరో గుజరాత్ ప్లేయర్ ప్రసిద్ కృష్ణకు అత్యధిక వికెట్లు తీసినందుకు పర్పుల్ క్యాప్ దక్కింది. కృష్ణ ఈ సీజన్ లో 25 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఇద్దరికీ రూ. 10 లక్షల చొప్పున బీసీసీఐ క్యాష్ రివార్డు అందించింది.

మిగిలిన ప్లేయర్లకు లభించిన అవార్డులు

సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది మ్యాచ్- జితేశ్ శర్మ, రూ. లక్ష రివార్డ్

ఫాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్- శశాంక్ సింగ్, రూ. లక్ష రివార్డ్

సూపర్ సిక్సర్స్ ఆఫ్ ది మ్యాచ్- శశాంక్ సింగ్, రూ. లక్ష రివార్డ్

మ్యాచ్ లో అత్యధిక ఫోర్లు- ప్రియాన్స్ ఆర్యా, రూ. లక్ష రివార్డ్

గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్- కృనాల్ పాండ్యా, రూ. లక్ష రివార్డ్

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్- కృనాల్ పాండ్యా, రూ. 5 లక్షల రివార్డ్

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్- సాయి సుదర్శన్, రూ. 10 లక్షల రివార్డ్

సూపర్ స్ట్రయికర్‌ ఆఫ్ ది సీజన్- వైభవ్‌ సూర్యవంశీ, టాటా కర్వ్ కారు విజేత

ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్- సాయి సుదర్శన్‌, రూ.10 లక్షల రివార్డ్

సూపర్ సిక్సెస్‌ ఆఫ్‌ ది సీజన్- నికోలస్‌ పూరన్, రూ.10 లక్షల రివార్డ్

ది గో ఫోర్స్‌ ఆఫ్ ది సీజన్- సాయి సుదర్శన్‌, రూ. 10 లక్షల ప్రైజ్

గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్- మొహ్మద్‌ సిరాజ్‌, రూ. 10 లక్షల రివార్డు

క్యాచ్ ఆఫ్ ది సీజన్- కమిందు మెండిస్, రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్

చెన్నై సూపర్‌ కింగ్స్‌- ఫెయిర్‌ ప్లే అవార్డు, రూ.10 లక్షల ప్రైజ్

మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌- సూర్యకుమార్‌ యాదవ్‌, రూ.15 లక్షల రివార్డ్

పిచ్‌ అండ్‌ గ్రౌండ్‌- డీడీసీఏ, రూ.50 లక్షలు ప్రైజ్

పర్పుల్ క్యాప్- ప్రసిద్ధ్ కృష్ణ, రూ. 10 లక్షల ప్రైజ్

ఆరెంజ్ క్యాప్- సాయి సుదర్శన్, రూ. 10 లక్షల ప్రైజ్