Published On:

IPL 2025 : సమఉజ్జీలుగా రెండు జట్లు.. ఉత్కంఠలో అభిమానులు

IPL 2025 : సమఉజ్జీలుగా రెండు జట్లు.. ఉత్కంఠలో అభిమానులు

Royal Challengers Bengaluru vs Punjab Kings Today Final Match : మరికొన్ని గంటల్లో ఐపీఎస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్‌ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. ఇరుజట్లు ప్రస్తుతం సమ ఉజ్జీలుగా ఉన్నాయి. వీటిలో ఏ జట్టు గెలిచినా నూతన ఛాంపియన్‌ అవతరించినట్లే. ఇటు పంజాబ్‌, అటు బెంగళూరు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకోలేదు. పంజాబ్‌ 11 ఏళ్లుగా ప్లేఆఫ్స్‌లోకే రాలేదు. ఈసారే శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో ఫైనల్‌కు చేరుకుంది. అటు బెంగళూరు పరిస్థితి కూడా అంతే. 17 ఏళ్లుగా టైటిల్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంది.

 

నీకా.. నాకా!
ఐపీఎల్‌లో ఇప్పటివరకు బెంగళూరు, పంజాబ్‌ 36 సార్లు తలపడ్డాయి. రెండు జట్లు చెరో 18 మ్యాచుల్లో విజయం సాధించాయి. సమరంలో సమఉజ్జీలుగా ఉన్న బెంగళూరు, పంజాబ్‌ ఈసారి తుదిపోరులో తలపడనున్నాయి. ఉత్కంఠగా సాగే పోరు క్రీడాభిమానులకు పండుగే అని చెప్పొచ్చు. క్వాలిఫయర్‌- 1లో బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించడం బెంగళూరుకు సానుకూలాంశం. టైటిల్‌ను ఎగరేసుకుపోయేలా బలంగా కనిపించిన ముంబయిని క్వాలిఫయర్‌- 2లో ఓడించడంతో పంజాబ్‌‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో ఇరు జట్లలో ఎవరు విజేతగా నిలుస్తారో అని అభిమానులు ఉత్కంఠకు గురవుతున్నారు.

 

వర్షం పడి మ్యాచ్‌ సాగకుంటే..
తుదిపోరు కోల్‌కతా వేదికగా జరగాల్సి ఉంది. కోల్‌కతాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదున అహ్మదాబాద్‌కు మార్చారు. ఆదివారం ముంబయి, పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన క్యాలిఫయర్‌ -2లో అహ్మదాబాద్‌ వేదికగా నిర్వహించారు. కానీ, వర్షం వల్ల రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్‌ ప్రారంభమైంది. తుదిపోరు జరిగే సమయంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. క్వాలిఫయర్‌ 1, క్వాలిఫయర్‌ 2, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే లేదు కానీ, ఫైనల్‌కు మాత్రం బీసీసీఐ రిజర్వ్‌డేను ఏర్పాటు చేసింది. అంటే ఈ రోజు వర్షం పడి మ్యాచ్‌ సాగకుంటే, 4వ తేదీన నిర్వహిస్తారన్నమాట.

 

రిజర్వ్‌ డే రోజు ఆట సాగకుంటే బెంగళూరుకు చేదువార్తే..
రిజర్వ్‌ డే రోజు వర్షం పడి ఆట ముందుకుసాగకుంటే బెంగళూరుకు చేదువార్తే. ఎందుకంటే పంజాబ్‌‌ను విన్నర్‌గా ప్రకటించి ట్రోఫీని అందిస్తారు. లీగ్‌ దశను పంజాబ్‌ బెంగళూరు కంటే మెరుగైన స్థితిలో ముగించడమే దీనికి కారణం. ఇదే గనుక జరిగితే 2009, 2011, 2016ల్లో ఫైనల్‌కు చేరుకొని భంగపాటుకు గురైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరోసారి నిరాశ పడక తప్పదు. బెంగళూరు అభిమానులు మ్యాచ్‌ సమయంలో వర్షం పడొద్దని కోరుకుంటున్నారు. అభిమానులు అనుకుంటున్నట్లుగా మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించకుంటే మాత్రం ఐపీఎల్‌ తుదిపోరు వీక్షకులను మునివేళ్ల మీద నిలుచొని చూసేలా చేయడం ఖాయంగా కనిపిస్తోంది!

ఇవి కూడా చదవండి: