Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట.. ట్రెండింగ్ లో కోహ్లీ అరెస్ట్

ArrestKohli: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఘటనపై దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఘటన జరిగిందని కొందరు, పోలీసులు సరైన భద్రత ఏర్పాటు చేయలేదని ఇంకొందరు ఇలా ఎవరికి వారు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఘటనపై సోషల్ మీడియాలో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. తొక్కిసలాట ఘటనకు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీని బాధ్యుడని ఆయనను అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో #ArrestKohliని బీభత్సంగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే చిన్నస్వామి స్డేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయినా.. స్డేడియం లోపల మాత్రం ఆర్సీబీ విజయోత్సవాలు నిర్వహించడం ఎంతో ఘోరం అని నెటిజన్లు మండిపడుతున్నారు.