Published On:

PBKS in Final IPL 2025: శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. ముంబైని చిత్తు చేసి ఫైనల్ చేరిన పంజాబ్

PBKS in Final IPL 2025: శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్.. ముంబైని చిత్తు చేసి ఫైనల్ చేరిన పంజాబ్

Punjab Kings won by 5 Wickets Against Mumbai Indians Qualifier 2 Match IPL 2025: ఐపీఎల్‌ 2025లో భాగంగా లక్నో వేదికగా అహ్మదాబాద్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసి ఫైనల్ దూసుకెళ్లింది.

 

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ రోహిత్ శర్మ(8) విఫలమైనా బెయిర్ స్టో(38), తిలక్ వర్మ(44), సూర్యకుమార్ యాదవ్(44), నమన్ ధీర్(37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ బౌలర్లలో ఒమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జెమీసన్, స్టాయినీస్, చాహల్, వైశాక్ తలో వికెట్ తీశారు.

 

204 పరుగుల లక్ష్యఛేదనను పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్(6) విఫలమైనా ఇంగ్లిస్(38), ప్రియాంశ్ ఆర్య(20), నేహాల్ వధేరా(48), శ్రేయస్ అయ్యర్(87) పరుగులు చేయడంతో పంజాబ్ సులువుగా విజయం సాధించింది. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ 2 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, హార్దిక్ తలో వికెట్ తీశారు.