MI Vs RCB IPL 2025: పటిదార్, కోహ్లీ అర్ధ శతకాలు.. ముంబై లక్ష్యం 222

IPL 2025 – RCB made 221 runs against Mumbai Indians: వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ టాపార్డర్ దంచికొట్టింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ(67) పరుగులు చేశాడు. రజత్ పటిదార్(64) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లేలో బౌండరీలతో చెలరేగిన కోహ్లీ చెలరేగాడు. పడిక్కల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. నాలుగో వికెట్‌కు జితేశ్ శర్మ (40 నాటౌట్)తో కలిసి 69 పరుగులు జోడించిన పటిదార్ జట్టు స్కోర్ 200 దాటించాడు. బుమ్రా వేసిన 20వ ఓవర్లో జితేశ్ సిక్సర్ బాదగా, రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.
టాస్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ముంబై పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. తొలి బంతికి బౌండరీ బాదిన ఫిలిప్ సాల్ట్(4)ను రెండో బంతికే ఔట్ చేశాడు. నాలుగు పరుగులకే తొలి వికెట్ పడగా, విరాట్ కోహ్లీ(67) జట్టుపై ఒత్తిడి పడనీయలేదు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో 4 కొట్టిన విరాట్.. ఆపై బౌల్ట్ బౌలింగ్‌లో రెండుసార్లు బంతిని బౌండరీకి పంపాడు. విల్ జాక్స్ వేసిన 5వ ఓవరులో విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టడంతో ఆర్సీబీ స్కోరు 50 దాటింది. దీపక్ చాహర్ వేసిన 6వ ఓవరులో పడిక్కల్ వరుసగా 6, 6, 4 బాది 20 పరుగులు రాబట్టాడు. దాంతో ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది.