Published On:

S Jaishankar on US: ‘అమెరికా.. అమెరికాలోనే ఉంది’.. పాక్‌తో సంధి విషయంపై జైశంకర్ క్లారిటీ!

S Jaishankar on US: ‘అమెరికా.. అమెరికాలోనే ఉంది’.. పాక్‌తో సంధి విషయంపై జైశంకర్ క్లారిటీ!

Union Minister of External Affairs Jaishankar Comments on US over India Pakistan Conflict: భారత్‌-పాక్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం విషయంలో అగ్రరాజ్యం అమెరికా పాత్రపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ స్పందించారు. కాల్పుల విరమణపై ఇరుదేశాలు నేరుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని స్పష్టం చేశారు. ఇరుదేశాల ప్రతినిధులు హాట్‌లైన్‌ ద్వారా చర్చించినట్లు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో జైశంకర్ క్లారిటీ ఇచ్చారు.

 

భారత్‌-పాకిస్థాన్ దేశాల మధ్య అణుయుద్ధాన్ని ఆపానని, కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తానే కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి నుంచి ప్రచారం చేసుకుంటున్న విషయం విధితమే. రెండుదేశాల మధ్య సంధి తన ఘనతే అని చెప్పుకుంటున్నారని, ఈ ప్రక్రియలో అమెరికా పాత్రపై జైశంకర్‌కు ప్రశ్న ఎదురైంది. ‘ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉంది..? అని జైశంకర్‌ను ప్రశ్నించగా, ‘అమెరికా అమెరికాలోనే ఉంది’ అంటూ బదులిచ్చారు. ఉద్రిక్తల సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడినట్లు తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. అగ్రరాజ్యం కాకుండా పశ్చిమాసియా, ఇతర దేశాల నాయకులు ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఇండియాను సంప్రదించినట్లు జైశంకర్‌ చెప్పుకొచ్చారు.

 

ఏవైనా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇతర దేశాలు సంప్రదింపులు జరపడం సహజమేనని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన జరిగిన అవగాహన ఒప్పందం న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాలు సంప్రదించి తమ ఆందోళనను తెలియజేయడం సహజమన్నారు. కానీ, కాల్పుల విరమణ, సైనిక చర్యలను నిలిపివేయడం అనేది పూర్తిగా భారత్‌-పాకిస్థాన్ మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితమని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన పాకిస్థాన్ ఆర్మీ నుంచి తమకు ఓ సందేశం వచ్చిందని తెలిపారు. యుద్ధాన్ని ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. దీనిపై ఇరుదేశాల ప్రతినిధులు హాట్‌లైన్‌ ద్వారా చర్చలు జరిపారని జైశంకర్‌ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: