IPL 2025 : విజృంభించిన ఆర్సీబీ బౌలర్లు.. పంజాబ్ స్కోర్ 157

IPL 2025 : ఐపీఎల్ 2025 18వ సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో మహారాజా యదవీంద్ర సింగ్ మైదానం వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది.
ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ నామమాత్రపు స్కోరేకే పరితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 మాత్రమే చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య కేవలం (22) పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్(33), జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (31 నాటౌట్), మార్కో యాన్సెన్(25 నాటౌట్) నిలిచి పరుగులు రాబట్టారు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6), నేహాల్ వధేరా 5 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. మార్కస్ స్టొయినిస్ 1 పరుగు చేసి విఫలమయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మ 2 వికెట్లు తీశారు. పేసర్ రొమారియో షెఫర్డ్ ఒక వికెట్ తీశాడు.