Published On:

RCB vs CSK: ఆర్సీబీ – చెన్నై మ్యాచుకు వరుణ గండం?

RCB vs CSK: ఆర్సీబీ – చెన్నై మ్యాచుకు వరుణ గండం?

Bengaluru: నేడు బెంగళూరు వేదికగా చెన్నై తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ కు చేరుతుంది. చెన్నై ఇప్పటికే ఫ్లేఆఫ్స్ నుంచి నిష్ర్కమించింది. అయితే ఈ రోజు జరిగే మ్యాచ్  వర్షం కారణంగా రద్దవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో వరుసగా రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది. గురువారం ప్రాక్టీస్ మ్యాచ్ కు వర్షం వలన అంతరాయం ఏర్పడింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే చెరొక పాయింట్ లభిస్తుంది. సిరీస్ ఆరంభంనుంచి దూకుడుమీదున్న బెంగళూరుకు అంతగా ఉపయోగపడదు. ఈ మ్యాచ్ లో బెంగళూరు గెలిస్తే టాప్ 2లోకి వెళ్లేఅవకాశం ఉంది.

 

శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఇది 52వ మ్యాచ్. ఆర్సీబీ ఆడిన 10మ్యాచులలో ఏడింటిలో విజయం సాధించింది. చెన్నై ఆడిన 10మ్యాచులలో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది.  ఫ్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఐపీఎల్ లో ఇప్పటికి ఐదుసార్లు విజేతగా నిలిచింది చెన్నై. ఇదిలాఉంటే, ఈరోజు జరిగే మ్యాచ్ బెంగళూరుకు కీలకమైనది. ఇందులో గెలిస్తే మొదటి రెండు స్థానాలకు ఎగబాకే అవకాశం ఉంది.

 

బెంగళూరులో కొన్ని రోజులుగా వర్షం పడుతోంది. మ్యాచ్ కు ముందురోజు వర్షం పడటంవలన ప్రాక్టీస్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం,  మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3 గంటల మధ్య ఉరుములతో కూడిన వర్షం పడనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత వాతావరణం తేమ కలిగి ఉంటుందని, సాయంత్రం 7గంటలకు వర్షం పడే సూచనలు 50శాతం ఉంటాయని చెప్పింది.