Last Updated:

RCB vs SRH : సెంచరీతో చెలరేగి బెంగుళూరుని గెలిపించిన కోహ్లీ.. హెన్రిచ్ పోరాటం వృధా!

ఐపీఎల్ 2023 లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టి తన టీంని గెలిపించాడు. స‌న్‌రైజ‌ర్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 19.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు

RCB vs SRH : సెంచరీతో చెలరేగి బెంగుళూరుని గెలిపించిన కోహ్లీ.. హెన్రిచ్ పోరాటం వృధా!

RCB vs SRH : ఐపీఎల్ 2023 లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టి తన టీంని గెలిపించాడు. స‌న్‌రైజ‌ర్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 19.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి బెంగుళూరు విజయం సాధించింది. విరాట్ కోహ్లి (100; 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌గా.. డుప్లెసిస్‌(71; 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఊర కొట్టుడు తోడై మ్యాచ్ ని చేజిక్కించుకున్నారు. మ్యాచ్ ఆరంభం నుంచే తనదైన దోవకు శైలితో హైదరాబాద్ బౌలర్లపై చెలరేగిన కోహ్లీ తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మొదటి రెండు బంతుల్నీ బౌండరీకి తరలించి.. తన ఇన్నింగ్స్ చివరి వరకు అదే స్టైల్ ని కొనసాగించాడు.

మరోవైపు డుప్లెసిస్ కూడా కోహ్లీకి మంచి సపోర్ట్ అందించడంతో.. ఇద్దరూ పోటీపడి హిట్టింగ్ చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చేతులెత్తేశారు. 62 బంతుల్లో 100 పరుగులు చేసిన కోహ్లీ.. తొలి వికెట్‌కి 17.5 ఓవర్లలోనే డుప్లెసిస్‌తో కలిసి 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత ఇద్దరూ తక్కువ గ్యాప్ లోనే ఔటైపోయినా గ్లెన్ మాక్స్‌వెల్ (5 నాటౌట్), బ్రాస్‌వెల్ (4 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, న‌ట‌రాజ‌న్ చెరో వికెట్ తీశారు. సీజన్‌లో 13వ మ్యాచ్ ఆడిన బెంగళూరు టీమ్‌కి ఇది ఏడో విజయం కాగా.. దీంతో పాయింట్ల పట్టిక లోనూ నాలుగో స్థానానికి ఆర్సీబీ చేరుకుంది. మరోవైపు 13వ మ్యాచ్ ఆడిన హైదరాబాద్‌కి ఇది 9వ ఓటమి కాగా.. పట్టికలో చివరి స్థానంలో ఉంది.

Image

అంత‌క‌ ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్‌(104 : 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేశాడు. కేవలం 49 బంతుల్లో ఐపీఎల్‌లో త‌న మొద‌టి శ‌త‌కాన్ని అందుకున్నాడు హెన్రిచ్. మిగిలిన వారిలో హ్యారీ బ్రూక్‌ ( 27నాటౌట్‌ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అభిషేక్ శ‌ర్మ‌(11), రాహుల్ త్రిపాఠి(15), మార్‌క్ర‌మ్‌(18)లు తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యారు. దాంతో సన్‌రైజర్స్ 186 పరుగులు చేయగలిగింది. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో బ్రేస్‌వెల్ రెండు వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, షాబాద్ అహ్మ‌ద్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఈ సీజన్ లో ఒక జట్టు తరఫున రెండు  సెంచరీలు చేసిన ఆటగాళ్లలో  సన్ రైజర్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరే ఇతర ఫ్రాంచైజీలలో ఆటగాళ్లు రెండు సెంచరీలు చేయలేదు.  హ్యారీ బ్రూక్.. నైట్ రైడర్స్ తో ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో  సెంచరీ చేసిన విషయం తెలిసిందే. బ్రూక్ తర్వాత  తాజాగా క్లాసెన్  సెంచరీ బాదడంతో  సన్ రైజర్స్ తరఫున  సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్ గా అతడు నిలిచాడు. ఈ నలుగురూ ఓవర్సీస్ ప్లేయర్లే కావడం గమనార్హం.