IPL 2025: రేపే ఐపీఎల్ తొలి మ్యాచ్.. ఇప్పటివరకు టైటిల్ విన్నర్స్ ఎవరంటే?

IPL Title Winners from 2008 to 2024: ఐపీఎల్ 2025 18th సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే మొత్తం 10 జట్లు బరిలో దిగుతుండగా.. టైటిల్ సాధించేందుకు ప్రతి జట్టు కసరత్తు చేస్తోంది.
అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 17 సీజన్లు జరగగా.. ఎక్కువగా టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు కైవసం చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు ట్రోఫీ గెలవగా.. అంతే సమానంగా ముంబై ఇండియన్స్ కూడా 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 2010, 2011, 2018, 2021, 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోగా.. 2013, 2015, 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలుచుకుంది.
ఇక, ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి మొదలుకానుంది. ఇప్పటివరకు 17 సార్లు నిర్వహించిన ఐపీఎల్‌లో కప్పును పలు జట్లు కైవసం చేసుకునన్నాయి. 2008లో ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగగా తొలి టైటిల్‌ను రాజస్థాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. 2009లో రాయల్ ఛాలెంజర్స్ డెక్కన్ ఛార్జర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా.. డెక్కన్ ఛార్జర్స్ గెలుపొందింది. 2010లో ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా.. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
2013లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. 2014లో ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ పంజాబ్ జట్లు తలపడగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ కైవసం చేసుకుంది. 2015లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా ముంబై ఇండియన్స్ విన్నర్ అయింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ సొంతం చేసుకుంది.
2017లో ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తలపడగా.. ముంబై ఇండియన్స్, 2018లో ఫైనల్ మ్యాచ్‌లో సన్‌పైజర్స్ హైదరాబాద్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్, 2019లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్, 2020లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ కైవసం చేసుకుంది. 2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందగా.. 2022లో రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 2023లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందగా.. 2024లో ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా పైట్‌రైడర్స్ విజయం సాధించింది. ఇక, ఐపీఎల్ 18వ సీజన్‌లో ఏ జట్టు టైటిల్‌ను ముద్దాడుతుందో చూడాలి మరి.