Last Updated:

Ravindra Jadeja:‘మహీ భాయ్ ఆప్ కే లియే.. ’ ఇంటర్నెట్‌ను బ్రేక్ చేసిన జడ్డూ ట్వీట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. మహేంద్ర సింగ్ ధోనీ కెఫ్టెన్సీలో చెన్నై 5 వసారి ట్రోనీని ముద్దాడింది. లాస్ట్ బాల్ వరకు సాగిన ఉత్కంఠ మ్యాచ్ లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొట్టిన సిక్స్, ఫోర్ తో విజయం సీఎస్కే సొంతం అయింది.

Ravindra Jadeja:‘మహీ భాయ్ ఆప్ కే లియే.. ’ ఇంటర్నెట్‌ను బ్రేక్ చేసిన జడ్డూ ట్వీట్

Ravindra Jadeja: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టైటిల్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. మహేంద్ర సింగ్ ధోనీ కెఫ్టెన్సీలో చెన్నై 5 వసారి ట్రోఫీని ముద్దాడింది. లాస్ట్ బాల్ వరకు సాగిన ఉత్కంఠ మ్యాచ్ లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కొట్టిన సిక్స్, ఫోర్ తో విజయం సీఎస్కే సొంతం అయింది. ఈ క్రమంలో విన్నింగ్ షాట్స్ కొట్టిన జడేజాను ఎత్తుకున్న కెప్టెన్ కూల్ ధోని భోవోద్వేగానికి గురి అయ్యాడు. ఆ వీడిమో ఇపుడు సోషల్ మీడియా హల్ చల్ చేస్తోంది.

Image

స్పెషల్ ట్వీట్ తో(Ravindra Jadeja)

కాగా, చెన్నై విజయంపై రవీంద్ర జడేజా తాజాగా ట్వీట్ చేశాడు. ధోనిని ఉద్దేశించి స్పెషల్ ట్వీట్ ను పోస్ట్ చేశాడు జడ్డూ. ‘ ఇది వన్ అండ్ ఓన్లీ ఎంఎస్ ధోనీ కోసం మాత్రమే చేశాం. మహీ భాయ్ నీ కోసం ఏదైనా..’ అంటూ జడ్డూ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అనంతరం కూడా జడేజా ఇదే విషయం మాట్లాడాడు.

 

 

 ధోనీ కోసమే గెలిచాం

‘సొంత రాష్ట్రంలోని అభిమానుల మధ్య చెన్నై ఐదో టైటిల్‌ను గెలవడం అద్భుతంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. వర్షం తగ్గాలని అర్ధరాత్రి వరకూ వేచి చూశారు. ఈ సందర్భంగా సీఎస్కే అభిమానులకు శుభాకాంక్షలు చెబుతున్నా. ఇంతటి అపూర్వ విజయాన్ని ఒకే ఒక వ్యక్తి కోసం అంకితం ఇస్తున్నాం. మా కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ కోసమే గెలిచాం. చివరి ఓవర్‌లో మోహిత్ శర్మ చాలా స్లో బాల్స్ వేస్తాడని తెలుసు. స్ట్రయిట్‌గా బంతిని కొడదామని ముందే అనుకున్నా. చివరికి రిజల్ట్ మాకు అనుకూలంగా వచ్చింది. సీఎస్కే అభిమానులు ఎప్పుడూ మాకు మద్దతు ఇస్తూ ఉండాలి. మేము వారిని ఎంటర్టైన్ చేయడానికి కృషి చేస్తాం’ అని జడేజా తెలిపాడు. కేవలం 6 బంతుల్లోనే 15 పరుగులు చేసిన రవీంద్ర జడేజా సీఎస్కే టైటిల్‌ గెలవడంలో కీ రోల్ పోషించాడు. అంతకు ముందు బౌలింగ్‌లో కూడా 4 ఓవర్లకు 38 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.