Last Updated:

IPL 2025 : టాస్ గెలిచిన ఆర్సీబీ.. కోల్‌క‌తాకు తొలి ఓవ‌ర్లోనే షాక్

IPL 2025 : టాస్ గెలిచిన ఆర్సీబీ.. కోల్‌క‌తాకు తొలి ఓవ‌ర్లోనే షాక్

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజ‌న్ తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్స్‌లో జ‌రుగుతున్న పోరులో డిఫెండింగ్ చాంపియ‌న్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ సార‌థి ర‌జ‌త్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారీ స్కోర్ సాధించాల‌నే ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్‌క‌తాకు జోష్ హేజిల్‌వుడ్ పెద్ద షాకిచ్చాడు. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ (4) వికెట్ సాధించాడు.

 

 

ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. షారుక్ ఖాన్‌తో స్టెప్పులేసిన కోహ్లీ
ఐపీఎల్ 18 సీజ‌న్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సినీ తార‌లు, క్రికెట్ స్టార్లు ఆరంభ వేడుక‌ల్లో పాల్గొన్నారు. గాయ‌ని శ్రేయా ఘోష‌ల్, పంజాబీ సింగ‌ర్ క‌ర‌న్ హౌజ్లా త‌మ పాట‌ల‌తో ఉర్రూత‌లూగించారు. దీంతో స్టేడియం హోరెత్తిపోయింది. ఇద్ద‌రి సంగీత ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత మైక్ అందుకున్న‌ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ త‌న యాంక‌రింగ్‌తో ఫ్యాన్స్‌ను అల‌రించాడు.

 

 

త‌మ ఫ్రాంచైజీ ఆట‌గాడు రింకూ సింగ్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మాజీ సార‌థి విరాట్ కోహ్లీల‌తో క‌లిసి స్టెప్పులు వేసిన‌ బాద్‌షా అభిమానుల్లో జోష్ మ‌రింత పెంచాడు. కాసేప‌టికి బీసీసీఐ అధ్యక్షుడు రోజ‌ర్ బిన్ని, సెక్ర‌ట‌రీతో పాటు ఐపీఎల్ చైర్మ‌న్ అరుణ్ ధుమాల్‌.. కుర్ర హృద‌యాల్లో కొలువైన దిశా ప‌టానీని వేదిక‌పైకి ఆహ్వానించాడు షారుక్.

ఇవి కూడా చదవండి: