Showtime Movie: నవీన్ చంద్ర ‘షో టైమ్’.. ఎలా ఉందంటే..!

Showtime Movie: నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల ప్రధార పాత్రలో చిత్రం షో టైమ్. ఈ సినిమాను అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో కిషోర్ గరికిపాటి నిర్మాతగా తెరకెక్కిించారు. థ్రిల్లర్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం జూలై 4న అనగా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు.యితే ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ చిత్రం చాలా సింపుల్ లైన్ లో నడిచే కథ. రాత్రి, సుమారు 11 గంటల సమయంలో సూర్య (నవీన్ చంద్ర), శాంతి (కామాక్షి భాస్కర్ల) లతో కూడిన ఒక కుటుంబం ఇంట్లో సరదాగా మాట్లాడుకుంటే ఉంటారు. అప్పుడే సీఐ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర) వారి ఇంటికి వచ్చి, అర్ధరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని వార్నింగ్ ఇస్తాడు. ఈ క్రమంలో సూర్య, శాంతి, సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ లక్ష్మీకాంత్ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడే సమయంలోనే కథ ఊహించని టర్న్ తీసుకుంటుంది. ఈ కేసు నుండి ఆ కుటుంబం ఎలా బయటపడుతుంది, వారికి లాయర్ వరదరాజులు (వి.కె. నరేష్) ఎలా సహాయం చేసి కాపాడాడు అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ కథ మొత్తం ఒకే రోజులో జరుగుతుంది. ఒక సింపుల్ కథను దర్శకుడు మదన్ చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ కేవలం 45 నిమిషాల నిడివితో ముగుస్తుంది, ఇప్పుడు అసలు కథ సెకండ్ హాఫ్‌లో ప్రారంభమవుతుంది. ఒక ఇంట్రస్టింగ్ పాయింట్ ఎంటంటే.. కథలో లాయర్ వి.కె. నరేష్ ఎంటర్ అవుతాడో, అక్కడి నుండి మరింత రసవత్తరంగా, హిలేరియస్ కామెడీతో పాటు సస్పెన్స్‌ను కూడా దర్శకుడు సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు.
నరేష్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కథలో ఉన్న సస్పెన్స్ ను కూడా దర్శకుడు చాలా సమర్ధవంతంగా హ్యాండిల్ చేశాడు. రాజా రవీంద్ర, నరేష్ మధ్య జరిగే ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇక క్లైమాక్స్ ఊహించిన దానికి భిన్నంగా ఉండటం ఆకట్టుకుంటుంది. ఇటువంటి “రూమ్ డ్రామా” సినిమాలు మలయాళంలో ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి నేపథ్యంలోనే, దర్శకుడు మదన్ ఒకే రూమ్ లో సినిమాను ఆసాంతం నడిపించి ప్రేక్షకులను నిశ్చితంగా ఎంగేజ్ చేయగలిగాడు.
నటీనటుల పనితీరు:
నవీన్ చంద్ర ఇలాంటి థ్రిల్లర్ పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. ఆ అనుభవంతోనే చాలా ఈజీగా పాత్రలో ఒదిగిపోయి నటించాడు. నరేష్ తనదైన మార్క్ కామెడీతో అదరగొట్టాడు. ఆయన కామెడీ టైమింగ్ సన్నివేశాలకు కొత్త డెప్త్ తీసుకొచ్చింది. రాజా రవీంద్ర ఒక సైకో పోలీస్ పాత్రలో సినిమాను నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. కామాక్షి భాస్కర్ల తన పరిధి మేరకు మెప్పించింది. ఇక, జెమిని సురేష్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో నవ్వించాడు.
టెక్నికల్:
శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం చాలా బాగుంది, ఇది సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను ఎలివేట్ చేయడంలో బిజిఎం కీలక పాత్ర పోషించింది. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం హిలేరియస్ గా నవ్విస్తూ.. భయపెట్టే.. షో టైమ్.
రేటింగ్
3/5