Published On:

Cricket: నేడు ఇండియా- ఇంగ్లాండ్ మధ్య విమెన్ టీ20 మ్యాచ్

Cricket: నేడు ఇండియా- ఇంగ్లాండ్ మధ్య విమెన్ టీ20 మ్యాచ్

Women T20 Match: భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ తో పోరుకు సిద్ధమైంది. ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగే ఫస్ట్ టీ20 మ్యాచ్ తో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును ఢీకొనబోతోంది.

 

ఇక జట్టు అన్ని విధాల పటిష్టంగా ఉందని నిపుణుల అంచనా. డ్యాషింగ్ బ్యాటర్ షఫాలీ వర్మ రావడం మరింత కలిసవచ్చే అంశం. అలాగే తెలుగు ప్లేయర్ శ్రీ చరణి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే వంటి యువ క్రికెటర్లు జట్టులో చోటు దక్కింది. తమ సత్తా చూపించేందుకు ఇదే వారికి మంచి అవకాశం. కాగా కొన్ని మ్యాచ్ ల్లో ఉమా ఛెత్రి విఫలమవుతున్న నేపథ్యంలో స్మృతి మంధనాతో కలిసి షఫాలీ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ స్నేహ్ రాణా, పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అమన్ జోత్ కౌర్ రాణించాల్సిన అవసరం ఉంది. మరోవైపు రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ వంటి సీనియర్లు జట్టుకు దూరం కావడం జట్టుకు కొంత నిరాశ కలిగించే అంశం. మరోవైపు కెప్టెన్ నాట్- సివర్ బ్రంట్, అమీ జోన్స్, బ్యూమాంట్, డానీ వ్యాట్, ఎకిల్ స్టోన్ వంటి సీనియర్లతో ఇంగ్లాండ్ జట్టు బలంగా ఉంది.

ఇండియా విమెన్ టీమ్:

హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధనా, షఫాలీ వర్మ, జెమియా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.

ఇంగ్లాండ్ విమెన్ టీమ్:

నాట్ స్కైవర్- బ్రంట్ (కెప్టెన్), ఎమ్ అర్లాట్, టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, ఆలిస్ కాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, పైజ్ స్కోల్ఫీల్డ్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్- హాడ్జ్, ఇస్సీ వాంగ్.

ఇవి కూడా చదవండి: