ICC Women ODI Rankings: ఐసీసీ విమెన్ వన్డే ర్యాంకింగ్స్… టాప్ లో టీమిండియా ప్లేయర్

Smriti Mandhana got 1st Place in ICC Women ODI Ranking: వన్డే విమెన్స్ ర్యాంకింగ్స్ ను ఐసీసీ విడుదల చేసింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన టాప్ లో నిలిచింది. ఆరేళ్ల విరామమం తర్వాత ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ లో నిలిచింది. నిన్న ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్న సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్ వర్ట్ ను వెనక్కి నెట్టింది. కాగా ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో లారా తక్కువ స్కోర్లు చేసింది. దీంతో 19 రేటింగ్ పాయింట్లు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయింది.
కాగా మంధాన 727 పాయింట్లతో టాప్ లో ఉండగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ సివర్- బ్రంట్ (719) రెండో స్థానంలో కొనసాగుతోంది. వోల్ వర్ట్ కూడా 719 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల కొలంబోలో శ్రీలంక, సౌతాఫ్రికాతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో సెంచరీ చేయడంతో ఆమె టాప్ లోకి దూసుకొచ్చింది. దీంతో 2019 తర్వాత మళ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ లో నిలిచింది. కాగా ఇండియా బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వరుసగా 14, 15 ర్యాంకుల్లో ఉన్నారు.