Women World Cup Schedule 2025: విమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. భారత్- పాక్ మ్యాచ్ ఉంటుందా..?
Women World Cup Schedule 2025: ఈ ఏడాది చివర్లో జరిగే ఐసీసీ విమెన్స్ వరల్డ్ కప్ సిరీస్ కు సంబంధించి షెడ్యూల్ రిలీజైంది. కాగా భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ సిరీస్ కు సంబంధించిన మ్యాచ్ డేట్స్, వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు ఇవాళ పూర్తి షెడ్యూల్ ప్రకటించింది. కాగా వరల్డ్ కప్ సిరీస్ ఫస్ట్ మ్యాచ్ సెప్టెంబర్ 30న బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరగనుంది.
ఇక క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలంబోలో జరగనుంది. కాగా వరల్డ్ కప్ సిరీస్ లో అక్టోబర్ 26 వరకు గ్రూప్ దశ మ్యాచ్ లు జరగనున్నాయి. అనంతరం పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిన నాలుగు జట్లను సెమీఫైనల్స్ కు ఎంపిక చేస్తారు. కాగా సెమీఫైనల్ మ్యాచ్ లు అక్టోబర్ 29, 30 తేదీల్లో జరగనున్నాయి. మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో, రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలోని జట్టుతో సెమీ ఫైనల్స్ ఆడనున్నాయి. ఇక ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరగనుంది.
కాగా విమెన్స్ వరల్డ్ కప్ సిరీస్ లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. ఇందులో భారత్, శ్రీలంకలోని ఐదు వేదికల్లో హైబ్రిడ్ మోడ్ లో మ్యాచ్ లు జరగనున్నట్టు ఐసీసీ తెలిపింది. భారత్ లోని బెంగళూరు, గౌహతి, ఇండోర్, వైజాగ్ స్టేడియాల్లో మ్యాచ్ లు జరుగుతాయి. అలాగే పాకిస్తాన్ తో మ్యాచ్ ను మాత్రం శ్రీలంకలోని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఐసీసీ విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్
సెప్టెంబర్ 30- ఇండియా- శ్రీలంక- బెంగళూరు
అక్టోబర్ 1- ఆస్ట్రేలియా- న్యూజిలాండ్- ఇండోర్
అక్టోబర్ 2- బంగ్లాదేశ్- పాకిస్తాన్- కొలంబో
అక్టోబర్ 3- ఇంగ్లాండ్- సౌతాఫ్రికా- బెంగళూరు
అక్టోబర్ 4- ఆస్ట్రేలియా- శ్రీలంక- కొలంబో
అక్టోబర్ 5- ఇండియా- పాకిస్తాన్- కొలంబో
అక్టోబర్ 6- న్యూజిలాండ్- సౌతాఫ్రికా- ఇండోర్
అక్టోబర్ 7- ఇంగ్లాండ్- బంగ్లాదేశ్- గౌహతి
అక్టోబర్ 8- ఆస్ట్రేలియా- పాకిస్తాన్- కొలంబో
అక్టోబర్ 9- ఇండియా- సౌతాఫ్రికా- వైజాగ్
అక్టోబర్ 10- న్యూజిలాండ్- బంగ్లాదేశ్- వైజాగ్
అక్టోబర్ 11- ఇంగ్లాండ్- శ్రీలంక- గౌహతి
అక్టోబర్ 12- ఇండియా- ఆస్ట్రేలియా- వైజాగ్
అక్టోబర్ 13- సౌతాఫ్రికా- బంగ్లాదేశ్- వైజాగ్
అక్టోబర్ 14- న్యూజిలాండ్- శ్రీలంక- కొలంబో
అక్టోబర్ 15- ఇంగ్లాండ్- పాకిస్తాన్- కొలంబో
అక్టోబర్ 16- ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్- వైజాగ్
అక్టోబర్ 17- సౌతాఫ్రికా- శ్రీలంక- కొలంబో
అక్టోబర్ 18- న్యూజిలాండ్- పాకిస్తాన్- కొలంబో
అక్టోబర్ 19- ఇండియా- ఇంగ్లాండ్- ఇండోర్
అక్టోబర్ 20- శ్రీలంక- బంగ్లాదేశ్- కొలంబో
అక్టోబర్ 21- సౌతాఫ్రికా- పాకిస్తాన్- కొలంబో
అక్టోబర్ 22- ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్- ఇండోర్
అక్టోబర్ 23- ఇండియా- న్యూజిలాండ్- గౌహతి
అక్టోబర్ 24- పాకిస్తాన్- శ్రీలంక- కొలంబో
అక్టోబర్ 25- ఆస్ట్రేలియా- శ్రీలంక- ఇండోర్
అక్టోబర్ 26- ఇంగ్లాండ్- న్యూజిలాండ్- గౌహతి
అక్టోబర్ 26- ఇండియా- బంగ్లాదేశ్- బెంగళూరు
అక్టోబర్ 29- సెమీఫైనల్ 1- గౌహతి/ కొలంబో
అక్టోబర్ 30- సెమీఫైనల్ 2- బెంగళూరు
నవంబర్ 2- ఫైనల్- కొలంబో/ బెంగళూరు