Published On:

India vs New Zealand Schedule: న్యూజిలాండ్ తో భారత్ సిరీస్.. పూర్తి షెడ్యూల్ రిలీజ్!

India vs New Zealand Schedule: న్యూజిలాండ్ తో భారత్ సిరీస్.. పూర్తి షెడ్యూల్ రిలీజ్!

India vs New Zealand Schedule Out Now: వచ్చే ఏడాది ప్రారంభంలో టీమిండియా.. న్యూజిలాండ్ తో సుదీర్ఘ సిరీస్ కొనసాగించనుంది. ఈ మేరకు 2026 జనవరిలో న్యూజిలాండ్ జట్టు ఇండియా టూర్ కి రానుంది. ఇందులో కివీస్ తో భారత్ 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ నిన్న ప్రకటించింది. మ్యాచ్ లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే వడోదర వేదికగా జరగనుంది. రాజ్ కోట్ వేదికగా జనవరి 14న రెండో వన్డే, ఇండోర్ వేదికగా జనవరి 18న మూడో వన్డే జరగనుంది.

 

వన్డే సిరీస్ ముగియగానే జనవరి 21న నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. మొత్తం 5 టీ20 లు నాగపూర్ వేదికగా తొలి టీ20 జనవరి 21న జరగనుంది. రాయపూర్ వేదికగా జనవరి 23న రెండో టీ20, గౌహతి వేదికగా జనవరి 25న మూడో టీ20, వైజాగ్ వేదికగా జనవరి 28న నాలుగో టీ20, త్రివేండ్రం వేదికగా జనవరి 31న ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ సిరీస్ కు రూపకల్పన చేసింది. సిరీస్ లో రాణించిన ఆటగాళ్లకు వరల్డ్ కప్ పోరులో జట్టులో చోటు దక్కనుంది. దీంతో ప్లేయర్లకు ఈ సిరీస్ చాలా కీలకంగా మారనుంది.