Published On:

Dilip Doshi Passed Away: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత..!

Dilip Doshi Passed Away: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కన్నుమూత..!

Former India cricketer Dilip Doshi passed away: క్రికెట్ రంగంలో విషాదం చోటుచేసుకుంది. భారత మాజీ క్రికెటర్, స్పిన్నర్ దిలీప్ దోషీ(77) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగానే ఆయన లండన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపై బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది.

 

‘భారత మాజీ క్రికెటర్, స్పిన్నర్ దిలీప్ దోషి లండన్‌లో చనిపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. కాగా, దిలీప్ దోషికి భార్య కళిందీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారడుు నయన్ సర్రే, సౌరాష్ట్ర జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

 

ఇక, 1979 నుంచి 1983 మధ్య ఇండియా తరఫున ఆడాడు. మొత్తం 33 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. టెస్టు మ్యాచ్‌ల్లో 114 వికెట్లు పడగొట్టగా.. వన్డేల్లో 22 వికెట్లు తీశారు. మొత్తం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 989 వికెట్లు తీశారు. అయితే ఆసీస్‌పై‌ ఉత్తమ ప్రదర్శన కనబర్చాడు. మొత్తం 167 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు దేశీయంగా సౌరాష్ట్ర, బెంగాల్, కౌంటీల్లో నాటింగ్ హామ్ షైర్, వార్విక్ షైర్ తరఫున ఆడారు.

 

ఇవి కూడా చదవండి: