Wayne Larkins: ప్రముఖ లెజెండరీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ కన్నుమూత

Wayne Larkins Passes Away: ఇంగ్లిష్ ప్రముఖ లెజెండరీ క్రికెటర్ వేన్ వారకిన్స్ 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచాడు.
యూకేలోని బెడ్ ఫోర్డ్‌షైర్కు చెందిన వేన్ లార్కిన్స్. 1979 నుంచి 1991 మధ్య ఇంగ్లాండ్ తరఫున ఆడాడు. మొత్తం 13 టెస్టులు, 25 వన్డేలు ఆడాడు. ఇక, వేవ్ ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి 85 సెంచరీలు, 182 హాఫ్ సెంచరీలు చేశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 40,736 పరుగులు సాధించగా.. బౌలింగ్ విభాగంలోనూ 119 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాక్స్టన్ గ్రామంలో 1953 నవంబర్ 22న జన్మించిన వేన్ లార్కిన్స్.. క్రీడా ప్రపంచంలో నెడ్‌గా గుర్తింపు పొందాడు. టెస్టు క్రికెట్‌లో 25 ఇన్నింగ్స్‌లలో 20.54 సగటుతో 493 పరుగులు, వన్డేల్లో 24 ఇన్నింగ్స్‌లలో 24.62 సగటుతో 591 పరుగులు చేశాడు. వన్డేల్లో సెంచరీ చేయగా.. టెస్టుల్లో మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
వేవ్ లార్కిన్స్.. ఇంగ్లాండ్ జట్టుతో పాటు దేశీయ క్రికెట్ ప్రతినిధిగా నార్తాంప్టన్ షైర్, డర్హామ్, బెడ్ ఫోర్డ్ షైర్‌లకు సేవలు అందించాడు. ఆయన మృతిపై పలువురు క్రీడాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.