Hari Hara Veera Mallu Trailer: పుష్ప రికార్డు బ్రేక్.. 24 గంటల్లోనే ‘హరిహర వీరమల్లు’ ఆల్ టైమ్ రికార్డు

Hari Hara Veera Mallu Trailer: పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాను తొలుత క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకొని పూర్తి చేశారు. ఈ సినిమిలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక, ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ జూలై 3న 11.10 నిమిషాలకు విడుదల చేయగా రికార్డు సృష్టించింది. కేవలం 24 గంటల్లోనే ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. అంతకుముందు, ‘పుష్ప 2’ ట్రైలర్ రికార్డును అధిగమించింది.
అయితే, ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియా షేక్ అయింది. 24 గంటల్లోనే 48 మిలియన్ల వ్యూస్ సాధించింది. దీంతో అంతకుముందు పుష్ఫ 2 పేరిట ఉన్న 24 గంటల్లో 44.67 మిలియన్ వ్యూస్ రికార్డును బద్దలు కొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా, ఇప్పటివరకు టాలీవుడ్ సినిమాల్లో ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో ఎక్కువ వ్యూస్ సంపాదించుకున్న సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ 48 మిలియన్ వ్యూస్ తో నంబర్ వన్ స్థానానికి చేరగా.. 44.67 మిలియన్ వ్యూస్ తో పుష్ప 2 రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత గుంటూరు కారం 37.68 మిలియన్ వ్యూస్, గేమ్ చేంజర్ 36.24 మిలియన్ వ్యూస్, సలార్ 32.58 మిలియన్ వ్యూస్ తో టాప్ 5లో ఉన్నాయి.
ఇదిలా ఉండగా, అంతకుముందు ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ విడుదలైన కొసేపట్లోనే 25 మిలియన్ల వ్యూస్ దాటిందని, ప్రస్తుతం ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోందని చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ తెలిపింది. గతంలో ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ గ్లింప్స్ 24 గంటల్లో 27.67 మిలియన్ల వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అయితే, ‘హరిహర వీరమల్లు’ ఈ రికార్డును అధిగమించింది. కాగా, ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’గా సాగుతున్న ఈ మూవీ జూలై 24న థియేటర్లలో విడుదల కానుంది.