Last Updated:

IND vs AUS: అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు: రోహిత్‌ శర్మ

IND vs AUS: నాగపూర్ వేదికగా జరిగిన మెుదటి టెస్టుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఒక్క సెషన్‌లోనే ఆలౌట్ అవుతుందని అస్సలు ఊహించలేదని రోహిత్ అన్నాడు. మెుదటి టెస్టులో భారత్ 132 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది.

IND vs AUS: అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు: రోహిత్‌ శర్మ

IND vs AUS: నాగపూర్ వేదికగా జరిగిన మెుదటి టెస్టుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ ఒక్క సెషన్‌లోనే ఆలౌట్ అవుతుందని అస్సలు ఊహించలేదని రోహిత్ అన్నాడు. మెుదటి టెస్టులో భారత్ 132 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది.

ఇలా జరుగుతుందని అనుకోలేదు.. (IND vs AUS)

బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో భాగంగా భారత్ శుభారంభం చేసింది. మెుదటి టెస్టులో ఆసీస్ ను చిత్తుగా ఓడించి ఇన్సింగ్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ ట్రోఫీలో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 10 వికెనట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్.. 400 పరుగులకు ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ దీనిపై స్పందిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ ఒక్క సెషన్ లోనే ఆలౌట్ అవుతుందని ఊహించలేకపోయానని పేర్కొన్నాడు.

మంచి బ్యాటింగ్ లైన్ అప్ గల ఆసీస్.. ఇలా ఆలౌట్ అవుతుందని తమ జట్టు ఊహించలేదన్నాడు. బౌలింగ్‌లో కష్టపడాలని ముందే నిర్ణయించుకున్నాం. కానీ.. ఇంత త్వరగా ఆసీస్ ను పెవిలియన్ చేర్చుతామని అనుకోలేదన్నారు. పిచ్‌పై ఎలాంటి బౌన్స్‌ లేకపోవడం.. ఆశ్చర్యం కలిగించిందని రోహిత్ అన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా బౌలింగ్‌ చేశామని.. ఈ క్రెడిట్ వారికే చెందుతుందని రోహిత్ అన్నాడు.

ఆ వార్తలను ఖండించిన రోహిత్..

నాగపూర్ పిచ్ ను కేవలం భారత్ బౌలర్లకు అనుకూలంగా మలిచారని వస్తున్న వార్తలను రోహిత్ ఖండించాడు. మేం ఇలాంటి పిచ్‌లపై ఆడాలని అనుకుంటున్నాం. గత నాలుగేళ్లుగా.. ఇలాంటి పిచ్‌లపైనే ఆడుతున్నామని రోహిత్ తెలిపాడు. భారత్‌ పిచ్‌లపై పరుగులు సాధించాలంటే ప్రణాళిక ఉండాలని రోహిత్ సూచించాడు. పిచ్ బౌలింగ్ కు అనుకూలించిందే తప్పా.. భారత బౌలర్లకు కాదని రోహిత్ తెలిపాడు.

కెమెరామెన్ పై రోహిత్ శర్మ అసంతృప్తి..

తొలి టెస్టు మూడో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లో అశ్విన్‌ ఎల్బీ కోసం అప్పీల్ చేశాడు. అది నాటౌట్ అంటూ ఎంపైర్ తల ఊపాడు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. ఈ సమయంలో.. కెమెరామెన్ రోహిత్ శర్మన్ హైలెట్ చేశాడు. అది జౌటా కాదా అని చూపించకుండా తనవైపు చూపించడంతో.. సిరీయస్ అయ్యాడు. నన్నెందుకు చూపిస్తున్నావ్‌.. రివ్యూ చూపించు అంటూ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://twitter.com/FabulasGuy/status/1624315250748325888?s=20&t=gMVTfWaeUpJZ2y3bv5HTig