Last Updated:

Rohit sharma: రోహిత్ శర్మ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు.. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

Rohit sharma: రోహిత్ శర్మ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు.. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

Rohit Sharma sets record highest runs in ODI cricket history: ఇంగ్లాండ్‌తో టీమిండియాతో రెండో వన్డేలో తలపడుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లో 304 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనకు భారత్ బరిలోకి దిగింది.  భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడుతున్నారు. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో మంచి ఫామ్‌లో ఆడుతున్నాడు. అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ శర్మ వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. ఆ తర్వాత సకిబ్ మహ్మద్ వేసిన మూడో ఓవర్‌లో రెండో బంతిని రోహిత్ సిక్సర్‌గా మలిచాడు. 6 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ కోల్పోకుండా 47 పరుగులు చేసింది.

కాగా, స్టేడియంలో సాంకేతిక సమస్యతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. ఒక ప్లడ్ లైట్ వెలగలేదు. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆటగాల్లు సైతం మైదానాన్ని వీడారు. అయితే మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మరోవైపు భారత ఓపెనర్లు గిల్, రోహిత్‌లు సైతం అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బంది ఫ్లడ్ లైట్‌కు మరమ్మత్తులు చేయడంతో వెలిగాయి. దీంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.

ఈ క్రమంలో రోహిత్ శర్మ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోకి చేరాడు. 36 పరుగులు చేయడంతో టాప్ 10లోకి రోహిత్ దూసుకెళ్లాడు. అంతకుముందు రాహుల్ ద్రవిడ్(10,889 పరుగులు) ఉండగా.. రోహిత్ శర్మ వెనక్కినెట్టి పదో స్థానంలోకి దూసుకెళ్లాడు. తర్వాత మార్క్ వుడ్ వేసిన ఎనిమిదో ఓవర్లో రోహిత్ విరుచుకుపడ్డాడు. అనంతరం రషీద్ వేసిన 9వ ఓవర్‌లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు కొట్టి 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 9 ఓవర్లకు భారత్ వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది.