Rohit Sharma: సులువైన క్యాచ్ మిస్ చేశా.. అందుకే అక్షయ్‌కు డిన్నర్ ఆఫర్!

Rohit Sharma says sorry to Axar Patel whille dropped catch: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌పై విజయం సాధించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్.. ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ చేజారింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 9వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్‌కు వరుసగా రెండు వికెట్లు పడ్డాయి. తను వేసిన రెండో బంతికే ఓపెనర్ తంజిద్(25) కీపర్ కేఎల్ రాహుల్‌కు చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్(0) మూడో బంతికి కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన జకేర్ అలీ నాలుగో బంతికి స్లిప్‌లో ఔట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ జకేర్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ రోహిత్ మిస్ చేశాడు. దీంతో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ దక్కలేదు.
రోహిత్ శర్మ క్యాచ్ అందుకున్నట్లే కనిపించింది. కానీ చివరికి ఆ క్యాచ్ చేజారిపోయింది. వెంటనే తాను అందుకోవాల్సిన క్యాచ్‌ను వదిలేసినందుకు నేలకు రెండు, మూడు సార్లు బలంగా కొట్టాడు. తర్వాత అక్షర్‌కు రోహిత్ సారీ చెబుతున్నట్లు సైగలు చేశాడు. దీనిపై బౌలర్ అక్షర్ పటేల్ స్పందించాడు. ఆటలో ఇలాంటి సంఘటనలు సహజమే అని వివరించాడు. కాగా, మ్యాచ్ పూర్తయిన అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ‘వాస్తవానికి జకేర్ అలీ ఇచ్చిన క్యాచ్ చాలా సులవైనది. స్లిప్‌లో ఉన్న నేను ఆ క్యాచ్ అందుకోవాల్సింది. ఇందుకోసం సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ క్యాచ్ సడెన్‌గా చేజారిపోయింది. దీంతో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ దక్కే అవకాశం లేకుండా పోయింది. అందుకే నేను అక్షర్‌కు క్షమాపణలు చెప్పా. బహుళా,.. అక్షర్ పటేల్‌ను డిన్నర్ తీసుకెళ్తానూమో’ అంటూ వెల్లడించాడు.