Rohit Sharma: మరో రికార్డు చేరువలో రోహిత్.. 50 పరుగులు చేస్తే!
![Rohit Sharma: మరో రికార్డు చేరువలో రోహిత్.. 50 పరుగులు చేస్తే!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-09-at-13.55.09.jpeg)
Rohit Sharma nears Sachin Tendulkar’s tally in elite openers club: టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువయ్యాడు. మరో 50 పరుగులు చేస్తే సచిన్ తెండూల్కర్‌ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన రెండో భారత ఓపెనర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (16,119 పరుగులు, 332 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ (15,335 రన్స్, 346 మ్యాచ్‌లు) రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ 342 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 45.22 సగటుతో 15,285 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో మిగిలిన రెండు వన్డేల్లో సచిన్ రికార్డును రోహిత్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక మాజీ బ్యాటర్ సనత్ జయసూర్య ఓపెనర్‌గా అత్యధిక రన్స్ చేశాడు. 506 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చి 19,298 రన్స్ చేశాడు.