Last Updated:

Apex Council meeting: క్రికెటర్స్ అలవెన్స్ లపై బీసీసీఐ కీలక నిర్ణయం

టీమిండియా క్రికెటర్స్ అలవెన్స్ లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కీలక నిర్ణయాలు తీసుకుంది.

Apex Council meeting: క్రికెటర్స్ అలవెన్స్ లపై బీసీసీఐ కీలక నిర్ణయం

Apex Council meeting: టీమిండియా క్రికెటర్స్ అలవెన్స్ లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫారెన్ టూర్లకు వెళ్లే ప్లేయర్స్ అలవెన్స్ లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఫస్ట్ క్లాస్ టికెట్ తో ప్రయాణించేందుకు అనుమతి కూడా ఇచ్చింది. డైలీ అలవెన్స్ ను 1000 డాలర్లకూ పెంచింది. తాజాగా జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో బీసీసీఐ ఈ నిర్ణయాలను ప్రతిపాదించింది. కానీ ఈ సౌకర్యాలు గత ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.

ఏడేళ్ల తర్వాత మార్పులు(Apex Council meeting)

బీసీసీఐ దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ అలవెన్స్ లో మార్పులు చేసింది. ఇంతకుముందు రోజూవారి అలవెన్సులు 750 డాలర్లుగా ఉండేవి. దానిని 1000 కి పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అదే విధంగా స్వదేశంలో జరిగే సమావేశాలకు హాజరయ్యే బీసీసీఐ అధ్యక్షుడు , ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్ , సంయుక్త కార్యదర్శి సహా ఆఫీస్ బేరర్స్ కు ఒకరోజుకు రూ. 40 వేల అలవెన్స్ ను బీసీసీఐ చెల్లించనుంది. వాటితో పాటు బిజినెస్ క్లాస్ లో ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది. వర్క్ ట్రావెల్ కోసం రోజుకు రూ. 30 వేలు, సూట్ రూమ్ బుక్ చేసుకునేందుకు వీలు ఉంది. ఈ అలవెన్స్ లు ఆఫీస్ బేరర్స్ కింద ఐపీఎల్ ఛైర్మన్ కు కూడా వర్తిస్థాయి.

అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, ఇండియన్‌ క్రికెటర్స్‌ అసోసియేషన్‌ మెంబర్స్ కూడా సమావేశాలకు హాజరైనపుడు వారికి రూ. 40 వేలు, విదేశీ టూర్స్ కు వెళ్తే రోజుకు 500 డాలర్లను అలవెన్సులుగా చెల్లించనుంది. క్రికెట్ సలహా కమిటీ, పురుష, మహిళా జట్ల ప్రధాన కోచ్‌లు హాజరయ్యే ప్రతి సమావేశానికి రూ. 3.5 లక్షలు ఇవ్వనుంది. సమావేశాల కోసం ఒకవేళ ఫారిన్ టూర్ప్ కు వెళ్తే మాత్రం రోజుకు 400 డాలర్లు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. వీరంతా గౌరవ పదవుల్లో ఉండే ఆఫీస్ బేరర్ల కేటగిరీలోకి వస్తారు. అదే బీసీసీఐ సీఈవో విదేశీ పర్యటనకు వెళ్తే 650 డాలర్లు, దేశంలో అయితే రూ.15 వేలను అలవెన్స్ గా పొందుతారు.

 

ఇవి కూడా చదవండి: