Dil Raju: గుడ్‌న్యూస్ చెప్పిన దిల్ రాజు – యువతను ప్రోత్సహిస్తూ ‘దిల్ రాజు డ్రీమ్స్’ ప్రారంభం

Dil Raju to Launch Dil Raju Dreams Platform: టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించేందుకు సరికొత్త ప్లాట్‌ఫాంని తీసుకువచ్చారు. ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే పేరుతో కొత్త ప్లాట్‌ఫాంను ప్రారంభించరాఉ. దీని ద్వారా యువ దర్శకులు, నటీనటులు, రచయితలు, టెక్నిషియన్లు తమ ప్రతిభను ప్రద్శించే అవకాశం పొందవచ్చు.
వచ్చే నెల(జూన్) నుంచి ఈ పోర్టల్ యాక్టివ్ కానుంది. దీనికి ద్వారా ప్రతిభ ఉన్నవారంత ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ వివరాలను http://dilrajudreams.com/ లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారిని దిల్ రాజు టీం సంప్రదించి వారిని సెలక్ట్ చేస్తుంది. ఇండస్ట్రీలో తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తూ సరైన అవకాశం దొరకని వారికి ఇది అద్భుతమైన అవకాశమని చెప్పాలి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మించిన ఎన్నో సినిమా మంచి విజయం సాధించాయి.
స్టార్ హీరో చిత్రాలు, భారీ బడ్జెట్ చిత్రాలే కాదు.. చిన్న సినిమాలను కూడా తన బ్యానర్‌లో రిలీజ్ చేశారు. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించేవారిలో దిల్ రాజు ముందు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభ రావలని, ఇంక సినీ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలని సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతుంటారు. ఇప్పుడు ఏకండా కొత్త వారిని ప్రోత్సహించేందుకు దిల్ రాజు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాలెంట్ ఉండి గుర్తింపు దక్కని వారు దీనిని సదావకాశంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.