Last Updated:

Kushi Movie Review : విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన “ఖుషి” మూవీ రివ్యూ, రేటింగ్ ?

Kushi Movie Review : విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన “ఖుషి” మూవీ రివ్యూ, రేటింగ్ ?

Cast & Crew

  • విజయ్ దేవరకొండ (Hero)
  • సమంత (Heroine)
  • జయరామ్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, రోహిణి, లక్ష్మీ, శరణ్య, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు (Cast)
  • శివ నిర్వాణ (Director)
  • నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి (Producer)
  • హిషామ్ అబ్దుల్ వాహాబ్ (Music)
  • జి మురళి (Cinematography)
3

Kushi Movie Review : రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మళ్ళీ లవ్ ట్రాక్ లోకి వచ్చాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. గతంలో శివ దర్శకత్వం వహించిన మజిలీ సినిమాలో సామ్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అంతకు ముందు మహానటి చిత్రంలో విజయ్ – సామ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  భారీ అంచనాలతో వచ్చిన లైగర్ చిత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో తనకి బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  కాగా ఈ చిత్రం నేడు సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ తరుణంలో మూవీ రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ.. 

విప్లవ్ (విజయ్ దేవరకొండ) బీఎస్ఎన్ఎల్ లో జాబ్ చేస్తూ కశ్మీర్ లో ఉంటాడు. అక్కడ ఆరా బేగం (సమంత)ను చూసి ప్రేమలో పడతాడు. మతంతో సంబంధం లేకుండా ఆమె వెనక తిరుగుతాడు. తన మీద విప్లవ్ చూపించే ప్రేమ చూసి ఆరా కూడా ప్రేమలో పడుతుంది. తర్వాత తాను బేగం కాదని, బ్రాహ్మిణ్ అని, తన పేరు ఆరాధ్య అని, తాను ప్రముఖ హిందూ ప్రవచన కర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) కుమార్తె అని చెబుతుంది. చదరంగం శ్రీనివాసరావుకు… విప్లవ్ తండ్రి, ప్రముఖ నాస్తికుడు లెనిన్ సత్యం (సచిన్ ఖేడేకర్)కి అసలు పడదు. దాంతో వారి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరు. వాళ్ళను ఎదిరించి విప్లవ్, ఆరాధ్య పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? పెళ్లి తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి.. గొడవలకు కారణం ఏమిటి? చివరకు ఏం చేశారు? అనేది సినిమా స్టోరీ.

మూవీ విశ్లేషణ (Kushi Movie Review).. 

ముందుగా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఆడియన్స్ లో ఉన్న మొదటి ప్రశ్న భారీ ఫ్లాప్ ని మూట గట్టుకున్న శివకి విజయ్ ఎలా అని. ఆ తర్వాత సమంత, విజయ్ కలిసి నటిస్తున్నారు అని తెలిసాక ఆడియన్స్ లో కొంచెం సినిమా పట్ల క్యూరియాసిటీ పెరిగింది. కానీ సాయం అనారోగ్యం కారణంగా సినిమా లేట్ అవ్వడంతో మూవీ ఇక షేక్ కి చేరింది అని అనుకున్నారు. కానీ ఈ సినిమా సాంగ్స్ మూవీని అంచనాలను పెంచేశాయి అని చెప్పాలి. ప్రత్తి పాట మనసుకు హత్తుకునేలా ఇవ్వడంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇకపోతే ఈ చిత్రం కథ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేసారు. ప్రేమ కోసం పెద్దల్ని కాదని పెళ్లి పీటలు ఎక్కి ఆ తరువాత ఎదుర్కొనే సమస్యలు చుట్టూ కథ. ఇలాంటి సినిమాలు ఇప్పటికీ చాలానే వచ్చాయి.

Kushi

ఫస్ట్ సీన్ నుంచే కథలోకి వెళ్తూ… ఫస్టాఫ్ అంతా కాశ్మీర్ అందాలలో ఇద్దరి మధ్య లవ్ సీన్స్.. హీరోయిన్ ని ఇబ్బంది పెడుతూ హీరో ఆమె వెంటబడటం. ఆమె కూడా అతనిని ప్రేమించడం.. ఊహించని షాక్ ఇస్తూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం. అయితే బ్రాహ్మణ కుటుంబం ఇంటర్ కాస్ట్ మేరేజ్ .. కథలతో ఈ మధ్యకాలంలో రెండు సినిమాలు రాగా ఒకటి ఫ్లాప్ అయితే మరొకటి హిట్ అయ్యింది. అయితే ఈ మూవీకి మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యింది. ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంట విడిపోతారేమో అనే సందేహం అయితే క్రియేట్ చేయగలిగాడు. అదే చివరిదాకా నిలబెట్టింది.

కథ పరంగా కూడా చాలా హై వుండే మూమెంట్ ని బాగానే డిజైన్ చేసాడు కానీ లెంగ్త్ ఎక్కవ అవటంతో అవి పెద్దగా రిజిస్టర్ కావు. ఏదేమైనా ఫస్టాఫ్ తో పోల్చుకుంటే రెండో సగంలో అసలు కథ నడిపినా.. ఫస్టాఫే ఇంట్రస్ట్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ లో ఏమీ జరిగినట్లు అనిపించదు. ఎమోషనల్ డెప్త్ చూపించడంలో కాస్త వెనుకబడ్డారు. కానీ మొత్తానికి ప్రేక్షకులను అయితే మ్యాజిక్ తో కట్టిపడేశారు.

ఎవరెలా  చేశారంటే.. 

విజయ్ దేవరకొండ, సమంతల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు సరైన పాత్ర దొరికితే చింపి ఆరేసే రకం మన విజయ్. ఇక తనకు బాగా సెట్ అయ్యే ఈ తరహా పాత్రలో మళ్ళీ జీవించేశారు. ఎమోషనల్ సీన్లలోనూ మెప్పించారు. ఆరాధ్య పాత్రలో సమంత ఒదిగిపోయారు. సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, శత్రు, లక్ష్మీ, శరణ్య పొన్నవన్… ప్రధాన తారాగణం తమ పాత్రలకు న్యాయం చేశారు. ‘వెన్నెల’ కిశోర్ పాత్ర కాసేపు నవ్వించారు. బ్రహ్మానందం చివరి సన్నివేశంలో తళుక్కున మెరిశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. హిషామ్ అబ్దుల్ వాహాబ్ ఇచ్చిన పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయి.

కంక్లూజన్.. 

ఓల్డ్ స్టోరీ విత్ బెస్ట్ మ్యూజిక్ & యాక్టింగ్ తో మ్యాజిక్ చేసేశారు

ఇవి కూడా చదవండి: