Last Updated:

Bajrang Punia: పద్మశ్రీ ని వెనక్కి ఇచ్చేస్తున్నాను.. ప్రధాని మోదీకి లేఖ రాసిన రెజ్లర్ బజరంగ్ పునియా

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నికకు నిరసనగా ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై బజరంగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన సుదీర్ఘ లేఖను X  లో షేర్ చేసారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరగకపోవడమే కారణమని ఈ లేఖలో పునియా  పేర్కొన్నారు. 

Bajrang Punia:  పద్మశ్రీ ని వెనక్కి ఇచ్చేస్తున్నాను.. ప్రధాని మోదీకి లేఖ రాసిన రెజ్లర్ బజరంగ్ పునియా

Bajrang Punia: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నికకు నిరసనగా ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై బజరంగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన సుదీర్ఘ లేఖను X  లో షేర్ చేసారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరగకపోవడమే కారణమని ఈ లేఖలో పునియా  పేర్కొన్నారు.

ప్రియమైన ప్రధానమంత్రి జీ, మీరు చాలా పనుల్లో బిజీగా ఉంటారని తెలుసు. కానీ దేశంలోని రెజ్లర్లకు ఏమి జరుగుతుందో మీ దృష్టికి తేవడానికి నేను దీన్ని వ్రాస్తున్నాను. దేశంలోని మహిళా మల్లయోధుల గురించి మీరు తెలుసుకోవాలి. ఈ ఏడాది జనవరిలో బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రారంభించారు. నేను కూడా వారి నిరసనలో పాల్గొన్నాను. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన ఆగిపోయింది అని పునియా రాశారు.అయితే మూడు నెలల తర్వాత కూడా బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ లేదు. కాబట్టి ఢిల్లీ పోలీసులు అతనిపై కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఏప్రిల్‌లో మళ్లీ వీధుల్లోకి వచ్చాము. జనవరిలో 19 మంది ఫిర్యాదుదారులు ఉన్నారు, కానీ ఏప్రిల్ 7 నాటికి వారి సంఖ్య తగ్గింది. . అంటే బ్రిజ్ భూషణ్  మిగతా 12 మంది మల్లయోధులను తమ నిరసనలను విడిచిపెట్టేలా చేసాడు. తమ నిరసన 40 రోజుల పాటు కొనసాగిందని, మరో మహిళా రెజ్లర్ వెనక్కి తగ్గారని పునియా తెలిపారు.

ఏం చేయాలో అర్థం కాలేదు..(Bajrang Punia)

మేము చాలా ఒత్తిడికి గురయ్యాము. మా నిరసన ప్రదేశాన్ని కూల్చివేశారు, మమ్మల్ని ఢిల్లీ నుండి తరిమివేసారు. నిరసన తెలియజేయకుండా నిరోధించారు. ఏమి చేయాలో తెలియక మేము మా పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేయాలనుకున్నామని పునియా చెప్పారు.రైతులు మరియు వారి కోచ్‌లు తమ పతకాలను అలా చేయకుండా అడ్డుకున్నారని అన్నారు. హోం మంత్రి అమిత్ షా కూడా తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో, ఎలా బతకాలో అర్థం కాలేదు. ప్రభుత్వం, ప్రజలు నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. నాకు పద్మశ్రీ, ఖేల్ రత్న, అర్జున అవార్డులు వచ్చాయి.ఈ గౌరవాలు అందుకున్నప్పుడు చాలా సంతోషించాను.జీవితం విజయవంతమైందనిపించింది.కానీ, ఆ సమయంలో నేను ఆనందంగా ఉన్నదానికంటే ఈరోజు పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను అని పేర్కొన్నారు.సంజయ్ సింగ్ ఎన్నిక నేపధ్యంలో గురువారం మహిళా రెజ్లర్ సాక్షి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.