SRH vs RCB: నేడు హైదరాబాద్‌తో బెంగళూరు కీలక మ్యాచ్.. గెలిస్తే టాప్ ప్లేస్‌లోకి!

Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad in 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత రత్న అటల్ బీహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి కీలకం కానుంది. ఎలాగైనా హైదరాబాద్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో తొలి స్థానం కైవసం చేసుకునేందుకు ఆర్సీబీ కసరత్తు చేస్తుంది.
ఈ సీజన్లో బెంగళూరు దూకుడుగా ఆడుతోంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడగా.. 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మిగతా 3 మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా.. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 17 పాయింట్లతో ఆర్సీబీ రెండో స్థానంలో ఉంది. కానీ హైదరాబాద్.. 12 మ్యాచ్‌లు ఆడగా.. 4 మాత్రమే గెలిచి మిగతా 7 మ్యాచ్‌ల్లో ఓడింది. మరో మ్యాచ్ రద్దవ్వగా.. పాయింట్ల పట్టికలో 9 పాయింట్లతో హైదరాబాద్ 8వ స్థానంలో ఉంది.
ఒకవేళ, ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలిస్తే.. 17 పాయింట్లతో రెండో స్థానం ఉన్న ఈ జట్టు టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. అయితే, ఇప్పటికే హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఈ మ్యాచ్ గెలిచి ఫ్యాన్స్‌కు ఊరట ఇవ్వాలని భావిస్తోంది. ఇరు జట్లు ఇప్పటివరకు 24 సార్లు తలపడగా.. ఆర్సీబీ 11, ఎస్ఆర్హె్ 13 సార్లు విజయం సాధించాయి.