Last Updated:

కరోనా: దేశంలో కరోనా వ్యాప్తి.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా వైరస్ ఉద్ధృతి చూపుతున్న తరుణంలో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది.

కరోనా: దేశంలో కరోనా వ్యాప్తి.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

Corona Cases: ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా వైరస్ ఉద్ధృతి చూపుతున్న తరుణంలో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ విషయం తెలియజేశారు. ‘చైనా, జపాన్‌, దక్షిణకొరియా, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చేవారికి తప్పకుండా కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి. వారిలో ఎవరికైనా లక్షణాలు కనిపించినా, పాజిటివ్‌ వచ్చినా క్వారంటైన్‌లో ఉంచాలి. అలాగే ఈ దేశాల నుంచి వచ్చే వారి ఆరోగ్యస్థితి తెలియజేసేందుకు ఎయిర్‌ సువిధ ఫారం నింపడం తప్పనిసరి’ అని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ ఇలా ఉంది. పొరుగుదేశం చైనాలో కరోనా విజృంభిస్తోన్న తరుణంలో కొవిడ్ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీని జారీచేసింది. మెడికల్ ఆక్సిజన్, తగినస్థాయిలో సిలిండర్ల లభ్యత, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు వంటి ప్రాణాధార వ్యవస్థల పనితీరును సరిచూసుకోవాలి. పీఎస్‌ఏ ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలి. అలాగే వాటిని తనిఖీ చేసేందుకు తరచూ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలి. ప్రస్తుతం దేశంలో కొవిడ్ పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ అత్యవసర సమయాలను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల నిర్వహణను సరిచూసుకోవడం అత్యంత ముఖ్యమని రాష్ర్టాలకు కేంద్ర పంపిన అడ్వైజరీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి: