Published On:

Karnataka Kalaburagi : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

Karnataka Kalaburagi : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

Karnataka Kalaburagi : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురగి జిల్లాలో ఆగిఉన్న ట్రక్కును ఓ వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురగి జిల్లా జీవర్గి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరు హజరత్ కాజా గరీబ్ దర్గాకు వెళ్తుండగా ప్రమారం జరిగింది. మృతులంతా బాగల్ కోటకు చెందినవారని పోలీసులు తెలిపారు. మృతులు మెహబూబ్ (53), మహబూబ్ (29), వాజిద్ (2), మాలన్ (52), ప్రియాంక (13)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై నెలోగి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు కలబురగి పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: