Reservation For Locals in Karnataka: కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో స్థానికులకుపెద్ద పీట వేస్తూ మంత్రి వర్గ తీర్మానం
కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో సి మరియు డి గ్రేడ్ పోస్టులకు కన్నడిగులు లేదా స్థానిక నివాసితులకు 100 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. అయితే, సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరిశ్రమ దిగ్గజాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో దానిని తొలగించారు
Reservation For Locals in Karnataka: కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో సి మరియు డి గ్రేడ్ పోస్టులకు కన్నడిగులు లేదా స్థానిక నివాసితులకు 100 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. అయితే, సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరిశ్రమ దిగ్గజాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో దానిని తొలగించారు. అయితే, తరువాత, అతను తన X హ్యాండిల్‌లో మళ్లీ పోస్ట్‌ను షేర్ చేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కన్నడకు అనుకూలంగా ఉందని, కన్నడిగులకు మరిన్ని ఉద్యోగాలు, అవకాశాలు కల్పించేందుకు కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని ప్రైవేట్ పరిశ్రమలు, ఇతర సంస్థల్లో కన్నడిగులకు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 50%, నాన్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు 75% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. కన్నడ గడ్డపై కన్నడిగులకు ఉద్యోగాలు లేని పరిస్దితి ఉండకూడదని మాతృభూమిలో సుఖవంతమైన జీవితాన్ని నిర్మించుకునే అవకాశం కల్పించాలని మా ప్రభుత్వ ఆకాంక్ష. మాది కన్నడ అనుకూల ప్రభుత్వం. కన్నడిగుల సంక్షేమం చూడటమే మా ప్రాధాన్యత’ అని సిద్ధరామయ్య ఎక్స్‌లో ట్వీట్ చేసారు. దీనిపై రాష్టర్ ఐటీ శాఖ మంత్రి ప్రియాకం ఖర్గే మాట్లాడుతూ , బిల్లులోని క్లాజులపై పరిశ్రమల నిపుణులు, ఇతర శాఖలను లూప్ చేసి, అప్పుడే అమలు చేయాలని సీఎంను కోరినట్ుల తెలిపారు. “భయపడాల్సిన అవసరం లేదు, మేము విస్తృత సంప్రదింపులు జరుపుతాము అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. స్థానిక నివాసితులకు ఉద్యోగాలు కల్పించడం, అదే సమయంలో పెట్టుబడులు తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు.
బిల్లులో ఏముందంటే..(Reservation For Locals in Karnataka)
ఏదైనా పరిశ్రమ, ఫ్యాక్టరీ లేదా ఇతర సంస్థలు స్థానిక అభ్యర్థులను యాభై శాతం మేనేజ్‌మెంట్ కేటగిరీలలో మరియు డెబ్బై శాతం నాన్ మేనేజ్‌మెంట్ కేటగిరీలలో నియమించాలి. అభ్యర్థులు కన్నడను ఒక భాషగా సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కలిగి ఉండకపోతే, వారు ‘నోడల్ ఏజెన్సీ’ ద్వారా నిర్దేశించిన కన్నడ ప్రావీణ్య పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి.అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, ప్రభుత్వం లేదా దాని ఏజెన్సీల క్రియాశీల సహకారంతో మూడేళ్లలోపు సంస్థలు వారికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.తగినంత మంది స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, ఈ చట్టంలోని నిబంధనల నుండి సడలింపు కోసం ఒక సంస్థ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.ప్రతి పరిశ్రమ లేదా కర్మాగారం లేదా ఇతర స్థాపనలు ఈ చట్టంలోని నిబంధనలను పాటించడం గురించి నోడల్ ఏజెన్సీకి సమాచారం అందించాలి.