Last Updated:

Honeytrap Case: హనీ ట్రాపింగ్‌ వివాదం.. కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర దుమారం!

Honeytrap Case: హనీ ట్రాపింగ్‌ వివాదం.. కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర దుమారం!

Honey Trap allegations case discussion in Karnataka Assembly: హనీ ట్రాప్ కేసుపై దేశ వ్యాప్తంగా తీవ్ర రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా కర్ణాటకలో మంత్రులతో పాటు చాలామందిపై హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. తాజాగా, ఈ విషయం కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తోంది. ఈ హనీ ట్రాప్ వలలో చిక్కిన 48 నేతల పేర్లను బయటపెట్టాలని బీజేపీ నేతలు లేవనెత్తారు. అంతేకాకుండా ఇదేనా ప్రూఫ్ అంటు వీడియో సీడీలు చేతిలో పట్టుకొని సీఎం సిద్ధ రామయ్య ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

 

కొంతమంది నేతలు ఏకంగా వెల్‌లోకి దూసుకొచ్చారు. అనంతరం ఆందోళన నిర్వహించారు. కాగా, ఈ నిరసనలను సీఎం సిద్ధరామయ్య పట్టించుకోకుండా తలదించుకొని యథావిధిగా తన ప్రసంగం కొనసాగించారు. ఈ వివాదంపై అత్యున్నత స్థాయిలో విచారణ చేపడుతామని ప్రకటించారు. అంతకుముందు ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

 

అంతేకాకుండా, హనీ ట్రాప్‌పై జరుగుతున్న విచారణను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఈ మేరకు ముస్లిం కోటా బిల్లును పాస్ చేసేందుకు విమర్భలు చేశారు. అనంతరం స్పీకర్ చుట్టూ చేరి నిరసన చేపట్టారు. దీంతో బీజేపీ నేతల తీరుపై సీఎం సిద్ధ రామయ్య ఆసహనం వ్యక్తం చేశారు. ఈ హనీ ట్రాప్ విసయంలో ఒకసారి కేసు నమోదై దర్యాప్తు జరిగితే ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.