Last Updated:

Karnataka: కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్‌ ధర లీటరుకు రూ.3 పెంచింది. సవరించిన రేట్లు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం పెట్రోల్‌పై అమ్మకం పన్ను 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం పెంచింది.

Karnataka: కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

Karnataka: కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్‌ ధర లీటరుకు రూ.3 పెంచింది. సవరించిన రేట్లు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం పెట్రోల్‌పై అమ్మకం పన్ను 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం పెంచింది. పెట్రోలియం డీలర్స్‌ అసోసియేన్స్‌ ప్రకారం పెట్రోల్‌, డిజిల్‌ ధరలు వరుసగా రూ.3 నుంచి రూ.3.05 పైసల వరకు పెరిగినట్లు తెలిపారు.

ప్రస్తుతం పెట్రోల్‌ కర్నాటకలో లీటరు రూ.99.84కు విక్రయిస్తుంటే సవరించిన ధరల ప్రకారం రూ.102.84కు చేరుతుంది. అదే విధంగా డిజిల్‌ విషయానికి వస్తే లీటరు రూ.3.02 పైసలు పెంచారు. దీంతో లీటరు డిజిల్‌ రూ.85.93 నుంచి రూ.88.95కు చేరింది. రెవెన్యూ పెంచుకోవడానికి కర్ణాటక ఆర్థికమంత్రిత్వశాఖ పెట్రోల్‌, డిజల్‌ ధరలు పెంచాలని నిర్ణయించింది. ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ధరలు పెంచడంలో పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రధానంగా రవాణా రంగంతో పాటు సరకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో పెరిగిన రవాణా చార్జీలు తిరిగి వినియోగదారుడిపైనే పడుతుంది.

అదనపు రెవెన్యూ కోసం.. (Karnataka)

ఇదిలా ఉండగా కేంద్రప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసే ముడిచమురుపై విండ్‌ఫాల్‌ టాక్స్‌ను టన్నుకు రూ.5,200 నుంచి రూ.3,250కి తగ్గించింది. దీంతో వెంటనే కర్ణాటక ప్రభుత్వం కూడా అదనపు రెవెన్యూ కోసం పెట్రోల్‌ చార్జీలను పెంచింది. కాగా ప్రభుత్వం జులై 1, 2022లో మొట్టమొదటిసారి విండ్‌ఫాల్‌ టాక్స్‌ను అమల్లోకి తెచ్చింది. కాగా ఇలాంటి టాక్స్‌ను పలు దేశాల్లో అమల్లో ఉంది. ఎనర్జీ కంపెనీల లాభాల్లోంచి కొంత ప్రభుత్వాలు రాబట్టుకోవాలనే ఈ విండ్‌ఫాల్‌ టాక్స్‌ను అమల్లోకి తెచ్చారు.

కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్‌ ధరలు పెంచిన వెంటనే సామాన్యుడు లబోదిబో మంటున్నాడు. బీపీఓలు పనిచేసే తనకు నెలకు రూ.15వేల జీతం వస్తోంది. అలాంటి తాను పెరిగిన పెట్రోల ధరతో ఆఫీసుకుఎలా వెళ్లగలను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా అధికారంలోకి రావడానికి ప్రభుత్వాలు అలివిగాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత అవి అమలు చేయలేక పరోక్షంగా ఇలా పెట్రోల్‌, డిజిల్‌, లిక్కర్‌, రిజిస్ర్టేషన్‌ ఫీజు పెంచి ఖజానా నింపుకుంటున్నాయి. ఉచితాలు చాలా కాస్ట్లీ గురూ అని సామాన్యుడు నసుగుతున్నాడు.

ఇవి కూడా చదవండి: